కమల్ సినిమాలో విలన్ గా విజయ్..!

విశ్వ నటుడు కమల్ హాసన్ గురించి అందరికి తెలుసు.తన నటనతో ప్రేక్షకులను ముగ్దులుగా చేస్తాడు.

ఒకప్పుడు ఈయన సినిమాలంటే అభిమానులు థియేటర్స్ కు క్యూ కట్టేవారు.గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్ లేక కమల్ హాసన్ ఫామ్ లో లేడు.

ఈ మధ్య సినిమాలు పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చాడు కమల్ హాసన్.సొంతంగా పార్టీ కూడా పెట్టాడు.

కానీ ఇప్పుడు కమల్ హాసన్ రాజకీయాలకు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సినిమాలతో బిజీగా మార బోతున్నాడు.వరస పెట్టి సినిమాలు లైన్లో పెడుతూ బిజీగా అవ్వబోతున్నారు.

Advertisement

కమల్ హాసన్ ఒక కొత్త సినిమాకు సైన్ చేసాడు.విజయ్ తో మాస్టర్ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ లోకేష్ కనకరాజ్.

ఇప్పుడు ఈయన కమల్ హాసన్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా విక్రమ్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా ప్రకటించడంతో దక్షణాది ప్రజలు ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచుకున్నారు.మాస్టర్ సినిమా హిట్ అవ్వడంతో లోకేష్ కనకరాజ్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

అందుకే కమల్ హాసన్ సినిమా కూడా ఆ అంచనాలకు తగ్గట్టుగా రూపొందించే పనిలో లోకేష్ కనకరాజ్ ఉన్నట్టు తెలుస్తుంది.ఈ సినిమా పొలిటికల్ త్రిల్లర్ గా రూపొందించ బోతున్నాడు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తారనే ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.మొదటిజా విజయ్ సేతుపతి పేరు వినిపించిన తర్వాత ఫహద్ ఫాజిల్ చేస్తున్నట్టు తెలిసింది.ఈయన విలన్ పాత్ర చేయబోతున్నాడని అంతా భావించారు.

Advertisement

కానీ ఇప్పుడు మళ్ళీ విజయ్ పేరు తెరమీదకు రావడంతో విజయ్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది.లోకేష్ కనకరాజ్ విజయ్ తో చర్చించిన తర్వాత ఈ సినిమా చేయడానికి ఓకే అన్నట్టు తెలుస్తుంది.

త్వరలోనే మొదలవ్వబోయే ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారు.

తాజా వార్తలు