నాకు వ్యతిరేకంగా సీబీఐ కుట్ర కు పాల్పడుతుంది అంటున్న మాల్యా

భారత లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.9 వేల కోట్ల రూపాయలు ఎగొట్టిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం మాల్యా బ్రిటన్ లో తలదాచుకుంటుండగా ప్రస్తుతం అక్కడ కోర్టు లో ఈ ఎగవేత కేసు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.

అయితే తాజాగా తాను తీసుకున్న మొత్తం రుణాలను భారత ప్రభుత్వ బ్యాంకులకు తిరిగి చెల్లిస్తానని తనను వదిలి పెట్టమని భారత ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తుంది.భారత్‌ కు తనను అప్పగించే విషయమై అప్పీల్‌ చేసుకునేందుకు బ్రిటన్‌ కోర్టు మాల్యా కు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఈ విషయమై మాల్యా స్పందిస్తూ.సిబిఐ తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ.దేవుడు గొప్పవాడు.

న్యాయం ఇంకా మిగిలే ఉంది.సిబిఐ నాపై మోపిన ప్రాథమిక అభియోగాలపై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ఇంగ్లిష్‌ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ అప్పీల్‌కు అవకాశమిచ్చింది.

Advertisement

సిబిఐ అభియోగాలు తప్పు అని నేను చెబూతూనే ఉన్నా ప్రస్తుతం కోర్టు నాకు ఆ అవకాశం ఇచ్చింది అని ట్వీట్‌ చేశాడు.అలానే భారత ప్రభుత్వ బ్యాంకులలో తీసుకున్న రుణాలతో పాటు కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌ లైన్స్‌ ఉద్యోగులు, ఇతర రుణ దాతలకు కూడా అప్పులను తిరిగి చెల్లించేస్తానంటూ మాల్యా ఆ ట్వీట్ లో పేర్కొనడం విశేషం.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

Advertisement

తాజా వార్తలు