Leo Movie Review: లియో సినిమా రివ్యూ అండ్ రేటింగ్!

కోలీవుడ్ నటుడు విజయ్ (Vijay) తలపతి హీరోగా లోకేష్ కనగరాజు (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లియో(Leo).

లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఈ సినిమా రావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ సినిమాలో వివిధ భాషల నుంచి స్టార్ సెలబ్రిటీస్ అందరూ కూడా భాగమయ్యారు.విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ, ప్రియా ఆనంద్, మడోన్నా సెబాస్టియర్ తదితరులు ఈ సినిమాలో నటించారు.

ఇలా భారీ తారాగణంతో భారీ అంచనాల నడుము ప్రేక్షకుల ముందు కూర్చున్నటువంటి ఈ సినిమా ఆకట్టుకుంది ? ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే.

కథ:

పార్తీబన్ (విజయ్)కు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక చిన్న పట్టణంలో కాఫీ షాప్ పెట్టుకుని ఉంటారు ఈయన భార్య సత్య (త్రిష),( Trisha ) ఇద్దరు పిల్లలు (అబ్బాయి, అమ్మాయి)తో సంతోషంగా జీవిస్తున్నాడు.ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను కాపాడిన తర్వాత పార్తీబన్ ( Parthiban ) ఫోటోలు పేపర్ లో వస్తాయి.

దీంతో కథ మొత్తం మారిపోతుంది.అతడిని వెతుకుతూ ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్)( Sanjay Dutt ) గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు.తన కొడుకు లియో దాస్ (విజయ్) మరణించాడని ఇన్నాళ్ళూ అనుకున్నానని, అయితే పార్తీబన్ పేరుతో హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నాడని, నీ భర్త అసలు పేరు పార్తీబన్ అని సత్యతో చెబుతారు.

Advertisement

అసలు ఈ లియోదాస్ ఎవరు ఆయన పార్తీబన్ గా ఎందుకు మారిపోయారు ? అసలు ఈ సినిమా కథ ఏంటి అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

నటీ నటుల నటన:

స్టార్‌డమ్, కమర్షియల్ అంశాలు వంటివి పక్కన పెట్టి విజయ్ నటించారు.ఈ సినిమాలో విజయ్( Thalapathy Vijay ) తండ్రి పాత్రలో కనిపించారు.

విజయ్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది.కానీ ఆ క్యారెక్టర్ గ్రాఫ్ కాదు.

ప్రేక్షకులు కోరుకున్న విధంగా విజయ్ నుంచి కమర్షియల్ ఫైట్స్ రావడంతో లోకేష్ కూడా ఈ విషయంలో సక్సెస్ అందుకున్నారు.విజయ్ భార్య పాత్రలో త్రిష ఒదిగిపోయి నటించారు.

త్రిష కూడా ఈ పాత్రకు 100 శాతం న్యాయం చేశారు.ఇక ఇతర నటీనటులంతా కూడా వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారని చెప్పాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
మెగాస్టార్ కు ఆ పదవి దక్కబోతోందా ? 

టెక్నికల్:

లోకేష్ విజయ్ తో సరికొత్తగా సినిమా చేసే ప్రయత్నం చేశారు.అయితే అక్కడక్కడ కొన్ని ఎలివేషన్స్ మిస్ అయ్యాయని తెలుస్తోంది.మనోజ్ పరమహంస( Manoj Paramahamsa ) సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్.

Advertisement

పతాక సన్నివేశాల్లో కెమెరా మూమెంట్స్ అద్భుతంగా ఉన్నాయి.ఇక సంగీతం విషయానికి వస్తే అనిరుద్( Anirudh Ravichandran ) విక్రమ్, జైలర్ సినిమాలకు ఇచ్చినంతగా బిజీఎం ఈ సినిమాకు అందించలేకపోయారు.

పాటల్లో తెలుగు సాహిత్యం బాలేదు.ప్రొడక్షన్ వేల్యూస్ హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి.

విశ్లేషణ:

లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ సినిమా ఉంటుందా లేదా అన్న సందేహాలు అందరిలోనూ ఉంటాయి.చాలా తెలివిగా విజయ్ సినిమాను తన సినిమాటిక్ యూనివర్స్ కి కనెక్ట్ చేశారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఈ రెండు విషయాలు చెప్పడం వల్ల కథకు వచ్చిన ముప్పేమీ లేదు.

యాక్షన్ సీన్లను స్టైలిష్ కొత్తగా తీయడంతో పాటు రేసీ స్క్రీన్ ప్లేతో కథలను ముందుకు నడిపించడంతో తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ప్లస్ పాయింట్స్:

సినిమా ప్రారంభంలో హైనాతో ఫైట్, కాఫీ షాపులో షూటవుట్, లియో ఫ్లాష్‌ బ్యాక్ ఎపిసోడ్స్ బావున్నాయి. ఇంటర్వెల్ వరకు సినిమా చాలా ఆసక్తిగా కొనసాగింది.త్రిష నటన.

మైనస్ పాయింట్స్:

సెకండ్ హాఫ్ తర్వాత కొత్త కొత్త క్యారెక్టర్స్ రావడంతో కాస్త బోరింగ్ అనిపించింది.పెద్దగా ట్విస్టులు ఇచ్చే సన్నివేశాలు ఏమీ లేవు.

అనిరుద్ తన మ్యూజిక్ తో పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయారు.

బాటమ్ లైన్:

ఖైదీ, విక్రమ్ తో పాటు LCUను దృష్టిలో పెట్టుకుని వెళితే.అంచనాలు అందుకోవడంలో లియో సినిమా వెనకడుగు పడుతుందనే చెప్పాలి.

వీటితో పోల్చకుండా చూస్తే ఈ సినిమా కూడా యాక్షన్ పరంగా పరవాలేదనిపించింది అభిమానులు ఇష్టంగా చూసిన సాధారణ ప్రేక్షకులు ఒకసారి సినిమాని చూడవచ్చు.

రేటింగ్: 2.5/5

తాజా వార్తలు