Vijaykanth Wife Premalatha : భర్తపై ప్రేమతో విజయ్ కాంత్ బొమ్మను పచ్చబొట్టుగా పొడిపించుకున్న భార్య.. ఆమె ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే!

ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయ్ కాంత్( Vijay Kanth ) మరణం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెట్టిన సంగతి తెలిసిందే.

విజయ్ కాంత్ భార్య ప్రేమలత( Prema Latha ) తన భర్త బొమ్మను పచ్చబొట్టుగా వేయించుకోవడం గమనార్హం.

ప్రస్తుతం విజయ్ కాంత్ పచ్చబొట్టుకు( Vijay Kanth Tattoo ) సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండగా ఆ ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.అనారోగ్య సమస్యల వల్ల విజయ్ కాంత్ 2023 సంవత్సరం డిసెంబర్ 28వ తేదీన కన్నుమూశారు.

విజయ్ కాంత్ అభిమానులలో చాలామంది విజయ్ కాంత్ స్మారక స్థూపాన్ని సందర్శిస్తున్నారు.ఇక్కడ నిత్యం అన్నదానం చేస్తుండటం గమనార్హం.

నిత్యం విజయ్ కాంత్ గుర్తుకు రావాలనే ఆలోచనతో ఆమె ఈ టాటూను వేయించుకున్నారని సమాచారం అందుతోంది.చనిపోయిన భర్త విషయంలో ప్రేమలత చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Advertisement

భర్త మరణం ఆమెను ఎంతో బాధ పెట్టిందని తెలుస్తోంది.

ప్రేమలత తమిళనాడు రాష్ట్రానికి చెందిన పొలిటికల్ లీడర్ కావడంతో పాటు దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం( Desiya Murpokku Dravida Kazhagam ) పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేయడం జరిగింది.ప్రేమలత దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.విజయ్ కాంత్ మరణం తర్వాత ప్రేమలత ఒక సందర్భంలో మాట్లాడుతూ కెప్టెన్ మన మధ్య నుంచి వెళ్లిపోయినా ఆయన ఆత్మ మనతోనే ఉంటుందని కామెంట్లు చేయడం గమనార్హం.

విజయ్ కాంత్ ఆశయాలు కొనసాగిద్దామని ప్రేమలత చెప్పుకొచ్చారు.విజయ్ కాంత్ దాన గుణం, మంచితనం వల్లే ఆయన మరణిస్తే లక్షల మంది వచ్చారని ఆమె తెలిపారు.విజయ్ కాంత్ ఏ ఆశయాలతో పార్టీని మొదలుపెట్టారో ఆ ఆశయాల సాధనకు అందరం కలిసికట్టుగా పాటు పడదామని ప్రేమలత వెల్లడించారు.

ప్రేమలత వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.విజయ్ కాంత్ భార్య ప్రేమలత నిర్ణయాలను నెటిజన్లు తెగ ప్రశంసిస్తూ ఉండటం గమనార్హం.

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు