స్టార్ హీరోలను వెనక్కి నెట్టేసిన రౌడీ స్టార్

అర్జున్ రెడ్డి సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన హీరో విజయ్ దేవరకొండ, రౌడీ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు.

గీతా గోవిందం సినిమాతో తన సక్సె్స్‌ను కొనసాగించిన రౌడీ స్టార్ వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు.

కాగా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలందరినీ వెనక్కి నెట్టేసి తన సత్తా చాటుకున్నాడు.మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలను వెనక్కి నెట్టిన విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 5 మిలియన్ ఫాలోవర్లను సాధించుకున్నాడు.

ఈ ఫీట్ సాధించిన తొలి తెలుగు హీరోగా విజయ్ దేవరకొండ రికార్డు సృష్టించాడు.ప్రభాస్ (4 మిలియన్), మహేష్ బాబు(3.8 మిలియన్), రానా దగ్గుబాటి(3.4 మిలియన్) ఫాలోవర్లతో తరువాత స్థానాల్లో నిలిచారు.స్టార్ హీరోలను సైతం వెనక్కి నెట్టిన హీరోగా విజయ్ దేవరకొండ తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

అర్జున్ రెడ్డి సినిమాతో తన మార్క్ వదిలిన దేవరకొండ కొత్త ట్రెండ్‌ క్రియేట్ చేసి యూత్‌లో సూపర్ క్రేజ్‌ను దక్కించుకున్నాడు.ఈ హీరో ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
సూర్య తో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న మరో స్టార్ హీరో...

తాజా వార్తలు