ఆ ఒక్క నిర్ణయంతో.. విజయ్ దేవరకొండ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?

సినిమా అనే మాయా లోకంలో ప్రేక్షకులు ఎప్పుడు ఎటు వైపు నిలబడతారు అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది.

అందుకే ప్రతి హీరో కూడా తాము ఎంచుకున్న కథ ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా కథలో బలం ఉందా లేదా అని ఎక్కువసార్లు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇక పొర పాటున ఏదైనా నిర్ణయం తీసుకొని సినిమా తీస్తే ఇక బొక్క బోర్లా పడి పోవడం తప్ప ఇంకేమీ ఉపయోగం ఉండదు.ఇలా ఇటీవలి కాలంలో ఎంతో మంది హీరోలు కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోక పోవడంతో అట్టర్ ఫ్లాప్ లతో ఇబ్బందులు పడ్డ వారు చాలా మంది ఉన్నారు.

అయితే కేవలం కథ విషయంలోనే కాదు ప్రతి హీరో చేసే సినిమా వారి బాడీ లాంగ్వేజ్ కు మ్యాచ్ అవుతుందా లేదా.ఇక ప్రేక్షకులు ఆ హీరోని సరికొత్తగా యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.

ఇలా తన కథల ఎంపిక తోనే తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగిన హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు.అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు దాదాపుగా  చేయడానికి ఏ హీరో కూడా ధైర్యం చేయరు.

Advertisement

కానీ అలాంటి దైర్యం చేసి ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించాడు విజయ్ దేవరకొండ.గీత గోవిందం ఎంపిక చేసుకొని తనను ప్రేక్షకులకు కొత్తగా చూపించాడు.

కానీ ఇప్పుడు మాత్రం విజయ్ దేవరకొండ తీసుకుంటున్న నిర్ణయాలు రానున్న రోజుల్లో ఇబ్బందుల్లోకి నెట్ట పోతున్నాయ్ అన్నది అభిమానులు అనుకుంటున్న మాట.ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు రౌడీ హీరో.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుందట.

ఇక  వెంటనే అదే దర్శకుడితో జనగణమన అనే సినిమా తీయడానికి రెడీ అయ్యాడు.అంతేకాకుండా ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం శివ నిర్వాణ డైరెక్షన్లో కూడా ఒక సినిమాకి ఓకే చెప్పేశాడట రౌడీ హీరో.

ఇక ఈ సినిమాకు మరింత క్రేజ్ రావడానికి సమంత ను హీరోయిన్ గా  తీసుకోబోతున్నారనీ టాక్.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

అంతా బాగానే ఉంది కానీ ఇటీవలే నానీ తో టక్ జగదీష్ లాంటి సినిమా తీసి ప్రేక్షకులను నిరాశ పరిచినా శివ నిర్వాణ తో విజయ్ దేవరకొండ సినిమాకు రెడీ అవడం మాత్రం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఇప్పటికే హిట్ లేక సతమత మవుతున్న విజయ్ దేవరకొండ ఒకవేళ లైగర్ సక్సెస్ అవ్వలేదు అంటే కెరియర్ కు పెద్ద బొక్క పడిపోతుంది.ఇక శివ నిర్వ డైరెక్షన్లో సినిమా అంటే ఇక ఈ సినిమాపై కూడా ఏలాంటి అంచనాలు ఉండవు.

Advertisement

దీంతో ఇక విజయ్ తీసుకున్న నిర్ణయం కారణంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ అభిమానులు అనుకుంటున్నారట.

తాజా వార్తలు