'ఖుషి' మరో వండర్.. అక్కడ హైయెస్ట్ కలెక్షన్స్ తో రికార్డ్ !

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ డ్రామా ఖుషి శివ నిర్వాణ( Shiva Nirvana ) దర్శకత్వంలో లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకు పోయింది.అయితే మధ్యలో వర్షాల బీభత్సం కారణంగా ఈ సినిమా కలెక్షన్స్ కు గండి పడింది.

Vijay Devarakonda Khushi Movie Record In Tamil Nadu, Vijay Devarakonda, Tollywoo

100 కోట్ల కలెక్షన్స్ ఈజీగా దాటుతుంది అని అనుకునే లోపే కలెక్షన్స్ ఆగిపోయాయి.అయినప్పటికీ మిగతా చోట్ల దూసుకు పోతుంది.పలు భాషల్లో రిలీజ్ అయినా ఈ సినిమా అన్ని చోట్ల మంచి టాక్ తెచ్చుకుంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ రాబడుతూ దూసుకు పోతుంది.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా తమిళ్ వర్షన్ లో సరికొత్త రికార్డ్ అందుకుంది.

విజయ్ దేవరకొండకు తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఫాలోయింగ్ బాగా ఉంది.దీంతో తమిళనాడులో ఖుషి సినిమా( Khushi Movie )కు కూడా ముందు నుండి మంచి క్రేజ్ ఉంది.

Advertisement
Vijay Devarakonda Khushi Movie Record In Tamil Nadu, Vijay Devarakonda, Tollywoo

అదే క్రేజ్ తో 2023 ఏడాదికి గాను ఖుషి సినిమా 7 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ అందుకుని ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది.రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ ను ఏ సినిమా బీట్ చేస్తుందో చూడాలి.

Vijay Devarakonda Khushi Movie Record In Tamil Nadu, Vijay Devarakonda, Tollywoo

మొత్తానికి విజయ్ ఈ స్థాయి కలెక్షన్స్ ను అన్ని చోట్ల రాబడుతూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఖుషి సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో విజయ్ ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషీగా ఉన్నారు.గత 5 ఏళ్ల తర్వాత విజయ్ దేవరకొండకు వచ్చిన హిట్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.

కాగా ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మించారు.హేషం అబ్దుల్ సంగీతం అందించాడు.

పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?
Advertisement

తాజా వార్తలు