వరుస ఫ్లాప్స్‌ వస్తున్న రౌడీ స్టార్‌డం పై.. పైకి

అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో యూత్‌ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ టాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌గా మారిపోయాడు.

గీత గోవిందం తర్వాత నోటా.

డియర్‌ కామ్రేడ్‌.ట్యాక్సీవాలా.

వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రాతో వచ్చిన రౌడీ స్టార్‌ సక్సెస్‌ దక్కించుకోలేక పోయాడు.ఆ సినిమాలతో సక్సెస్‌ దక్కించుకోకున్నా కూడా విజయ్‌ దేవరకొండ స్టార్‌ డం మాత్రం సినిమా సినిమాకు పెరిగి పోతూనే ఉంది.

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అంతా కూడా ఇప్పుడు ఇన్‌ స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ పెంచుకునేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు.తాజాగా రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ఏకంగా 8 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను దక్కించుకున్నాడు.

Advertisement

సౌత్‌లో ఏ స్టార్‌ హీరో కూడా ఈ స్థాయిలో ఫాలోవర్స్‌ను పొందలేదు.బాలీవుడ్‌ లో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉన్న కారణంగానే విజయ్‌ దేవరకొండకు ఈ స్థాయిలో ఫాలోవర్స్‌ ఉన్నారంటూ సోషల్‌ మీడియా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాల పరంగా విజయ్‌ దేవరకొండ నిరాశ పర్చుతున్నాడు.అయినా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం ఆయన స్టార్‌ డం చూపించుకున్నాడు.సినిమాల ఫ్లాప్స్‌ వల్ల స్టార్‌ డం పడిపోవడం జరుగుతుంది.

కాని ఈ రౌడీ స్టార్‌ స్టార్‌డం మాత్రం పై పైకి వెళ్తోంది.ఈయన ప్రస్తుతం పూరి దర్శకత్వంలో చేస్తున్న పాన్‌ ఇండియా మూవీ సక్సెస్‌ అయితే ఫాలోవర్స్‌ కోటి మంది అయ్యే అవకాశం ఉందంటూ విశ్లేషకులు అంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు