వంద కోట్లకు ఎసరుపెట్టిన రౌడీ

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని రెడీ చేస్తున్నాడు.

ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.

కాగా ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులకు ఎసరు పెట్టారు పూరీ అండ్ టీమ్.అయితే ఈ సినిమాను బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

అయితే ఈ సందర్భంగా విజయ్ దేవరకొండతో ఓ భారీ ఢీల్‌ను కుదుర్చుకున్నాడట కరణ్ జోహార్.ఈ ఢీల్ ఏకంగా రూ.100 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.కరణ్ జోహర్ తెరకెక్కించబోయే సినిమాల్లో విజయ్ దేవరకొండ నటించనున్నాడట.

అయితే అవి ఎలాంటి సినిమాలు అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.ఏదేమైనా బాలీవుడ్ నిర్మాతతో విజయ్ దేవరకొండ ఇంతటి భారీ ఢీల్‌న కుదుర్చుకోవడంతో అతడి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Advertisement

కాగా పూరీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న లైగర్ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో విజయ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు.

అంతర్జాతీయ విద్యార్ధులకు భారత్ శుభవార్త .. కొత్తగా రెండు స్పెషల్ వీసాలు
Advertisement

తాజా వార్తలు