విజయ్ దేవరకొండ ఆశలన్నీ ఆవిరైపోయాయి?

ఒసి నిమాపై అంచనాలు పెరిగితే మంచిదే కానీ సినిమా రిలీజ్ తరువాత సినిమా ఎంత బావున్నా ఆడియెన్స్ అంచనాలను అందుకోకపోతే మొదటికే మోసం వస్తుంది.బహుశా డియర్ కామ్రేడ్ విషయంలో అదే జరిగిందేమో.

? సినిమాపై విజయ్ పెట్టుకున్న ఆశలు కొంతైనా నెరవేరలేదు.విడుదలైన నాలుగు భాషల్లో సినిమా నష్టాలను మిగిల్చింది.

పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ విజయ్ క్రేజ్ స్థాయికి తగ్గట్టుగా సినిమాలో కొత్తగా ఏమి లేదని ఓ వర్గం నుంచి టాక్ వచ్చింది.సినిమా కాన్సెప్ట్ అందరికి చేరువవుతుందని విజయ్ తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళం బాషలలో కూడా సినిమాను రిలీజ్ చేశాడు.మొదట తమిళ్ లో మాత్రమే రిలీజ్ చేయాలనీ అనుకున్న నిర్మాతలు మిగతా రెండు భాషల్లో చేస్తే బావుంటుందని విజయ్ కోరిక మేరకు ప్రమోషన్ డోస్ పెంచి గట్టిగానే రిలీజ్ చేశారు.

కానీ సినిమా బిజినెస్ వరల్డ్ వైడ్ గా 22కోట్ల వరకే క్లోజ్ అయ్యింది.30కోట్లకు పైగా అమ్ముడైన డియర్ కామ్రేడ్ ఏ స్థాయిలో నష్టాలను అందించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.గీత గోవిందం సెంటిమెంట్ కలిసొస్తుందని రష్మిక మందన్నను ఏరికోరి సెలెక్ట్ చేసుకున్నారు.

Advertisement

అది కూడా వర్కౌట్ కాలేదు.మరి నెక్స్ట్ విజయ్ ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.

ఆ పండుగను టార్గెట్ చేసిన ఎన్టీఆర్.. తారక్ ప్రశాంత్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Advertisement

తాజా వార్తలు