ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన 'లియో'.. అక్కడ గ్రాండ్ రిలీజ్!

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) కు తెలుగులో కూడా ఫాలోయింగ్ ఉంది.

అందుకే ఈయన సినిమాలు మన దగ్గర కూడా భారీ స్థాయిలోనే రిలీజ్ చేస్తుంటారు.

మంచి టాక్ వస్తే ఇక్కడ కూడా బాగానే కలెక్షన్స్ రాబడతారు.ఈ ఏడాది వారిసు సినిమాతో విజయం సాధించిన విజయ్ మరో సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు.

విజయ్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ( Lokesh Kanagaraj )దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్నాడు.భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్ లలో ఒకటిగా తెరకెక్కుతుంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియెన్స్ ను అలరించి అంచనాలు అమాంతం పెంచేసింది.

Advertisement

ఇటీవలే ఈ సినిమా ఐమాక్స్ వర్షన్ గురించి అప్డేట్ ఇచ్చారు.ఈ సినిమాను యూఎస్ డిస్టిబ్యూటర్స్ అక్కడ ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.ఈ క్రమంలోనే తాజాగా లియో సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా ( RRR movie )రికార్డును బీట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

అప్పట్లో ఆర్ఆర్ఆర్ సినిమా యూఎస్ లో నెవర్ బిఫోర్ రేంజ్ లో రాజమౌళి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

మరి ఇప్పుడు లోకేష్ కూడా లియో( LEO Movie ) కోసమా అంతకంటే గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.అక్కడ ఐమాక్స్ స్క్రీన్స్ లో దాదాపు 80 స్క్రీన్స్ లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాగా ఇప్పుడు ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే విధంగా విజయ్ లియో రిలీజ్ అవుతున్నట్టు టాక్.80కి పైగానే ఐమాక్స్ స్క్రీన్స్ ఈ సినిమా కోసం దక్కాయని తెలుస్తుంది.కాగా సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష( Trisha ) హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు