వావ్‌.. ఒట్టి చేతులతో తేనెటీగలను పట్టి ‘రాణి’ని కానుకగా ఇచ్చి..!

తేనెటీగ కరిస్తేనే చాలా మంటగా ఉంటుంది.ఒక్క దానికే అలా ఉంటే మరి తేనెటీగల గుంపు ఉంటే.

అది కచ్చితంగా ప్రమాదకరమే.కానీ, ఒక మహిళ తేనెటీగాలను ఆమాంతం చేతితో పట్టుకుని పెట్టెలో పెట్టెసింది.

అంతే కాదు.వాటి రాణిని సైతం అందించిన వీడియో వైర ల్‌ అయ్యింది.

నిజానికి తేనెటీగల తుట్టెను చూస్తే భయం వెస్తుంది.కానీ, ఈ మహిళ చేసిన సాహసోపేతమైన పనికి ప్రశంసలు వస్తున్నాయి.

Advertisement
Video Viral Women Removes Bees With Bare Hands, Honey Bees, America, Bee Keeper

సాధారణంగా తేనెటీగలను పట్టుకోవాలంటే ఎంతో నేర్పు ఉండాల్సిందే!అయితే టెక్సాస్‌కు చెందిన ఎరికా థామ్సన్‌కు ఇది వెన్నతో పెట్టిన విద్య.ఆమె టెక్సాస్‌ బీ వర్క్స్‌లో బీ కీపర్‌గా పనిచేస్తోంది.

అందుకే ఆమెకు ఈ తేనెటీగలను పట్టడం తెలుసు.ఇటీవల ఒక అపార్ట్‌మెంట్‌లో ఓ గదిలో ఉన్న గొడుగులోకి తేనెటీగలు వచ్చి చేరాయి.

ఆ ప్రాంతంలో భారీ గాలులు రావడంతో అలా తేనెటీగలన్ని ఆ అపార్ట్‌మెంట్‌లోకి వచ్చి చేరాయి.దీంతో సమాచారం అందుకున్న ఎరికా అక్కడికి చేరుకుని తేనెటీగలను పరిశీలించింది.

చిందరవందరగా ఉండటంతో అవి రాణిని కోల్పోయాయని తెలుసుకుంది.ఎందుకంటే.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

తేనెటీగలకు రాణి చాలా ముఖ్యం.అవి రాణికి బానిసగా ఉంటాయి.

Video Viral Women Removes Bees With Bare Hands, Honey Bees, America, Bee Keeper
Advertisement

అవి రాణి లేనప్పుడు ఎంతో ఆందోళనకరంగా ఉంటాయి.వాటి పిల్లలను కూడా పట్టించుకోవు.కనీసం ఆహారం కూడా ముట్టవు.

ఈ విషయాన్ని అక్కడ పరిస్థితిని చూడగానే గ్రహించిన ఎరికా.ఆ గొడుగులో గుమిగూడిన తేనెటీగలను ఎంతో జాగ్రత్తగా తీసి పెట్టెలో పెట్టింది.

ఆ సమయంలో తేనెటీగలు ఆమెకు ఎటువంటి హాని కలిగించకపోవడం గమనార్హం.మొత్తం తేనెటీగలను అక్కడి నుంచి తీసిన తర్వాత.

ఆమె తనతోపాటు తీసుకువచ్చిన బాక్సులో తీసుకొచ్చిన ‘రాణి’ని వాటి ముందు ఉంచింది.చిత్రం ఏమిటంటే.

ఆ తేనెటీగలు ఆమెను రాణిగా స్వీకరించాయి.అంతేకాదు అవి ఒకదానికి ఒకటి.

తమ కొత్త రాణి కోసం సమాచారం అందిచుకున్నాయి.కొద్ది నిమిషాల తర్వాత తేనెటీగలు గొడుగు నుంచి బాక్సులోకి చేరుకుని రాణి చుట్టూ చేరాయి.ప్రస్తుతం ఈ వీడియోను 24 మిలియన్‌ మందికి పైగా వీక్షించారు.4.7 లక్షలు మందికి పైగా లైక్‌ చేశారు.ఎరికాకు ప్రశంసలు కూడా వెళ్లువెత్తుతున్నాయి.

మహిళగా ఆమె చేసిన పనికి మెచ్చుకోవాల్సిందేనని అంటున్నారు.

తాజా వార్తలు