వీడియో: పోలీస్ స్టేషన్‌ను కావాలనే ఎస్‌యూవీతో ఢీకొట్టిన వ్యక్తి .. తర్వాత ఏమైందో తెలిస్తే...

రోడ్డు మీద డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి.కాస్త అజాగ్రత్తగా ఉన్నా తీవ్రమైన ప్రమాదానికి గురయ్యే ప్రమాదం పెరుగుతుంది.

అయితే, ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తన ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేసాడు.ఈ షాకింగ్ ఘటన న్యూజెర్సీలో ( New Jersey )చోటు చేసుకుంది.

ఈ ఘటనలో ఓ వ్యక్తి స్పీడ్‌గా తన ఎస్‌యూవీని నేరుగా పోలీస్‌స్టేషన్‌లోకి డ్రైవ్ చేశాడు.

ఆ సమయంలో పోలీస్ స్టేషన్ డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి.పోలీసు అధికారులందరూ స్క్వాడ్ రూమ్‌లో ( squad room )రెస్ట్ తీసుకుంటున్నారు.సరిగ్గా అప్పుడే 34 ఏళ్ల జాన్ హార్గ్రీవ్స్ ఎస్‌యూవీ( John Hargreaves SUV ) వేసుకుని పోలీస్ స్టేషన్‌లోకి దూసుకొచ్చాడు.

Advertisement

పోలీస్ స్టేషన్ తలుపులు పగలగొట్టడమే కాకుండా పోలీస్ స్టేషన్‌లోని పలు వస్తువులను ధ్వంసం చేశాడు.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది.

ఆ వీడియోలో సదరు వ్యక్తి కారుతో పోలీస్ స్టేషన్‌ తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చినట్లు మీరు చూడవచ్చు.కారు స్టేషన్‌లోని బల్లలను, ఇంకా ఇతర వస్తువులను కూడా ధ్వంసం చేసింది.దాంతో అక్కడ ఉంచిన వస్తువులన్నీ అస్తవ్యస్తంగా మారాయి.

ఆ తర్వాత ఆ వ్యక్తి కారులోంచి బయటకు వచ్చి తాను సరెండర్ అయినట్లు చేతులు పైకెత్తాడు.లేదంటే పోలీసులు అతడిని అక్కడికక్కడే కాల్చి చంపేసేవారు.

ప్రమాద శబ్దం విన్న వెంటనే ఇద్దరు పోలీసు అధికారులు గది నుంచి బయటకు వచ్చి వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.ఆ వ్యక్తి కూడా అరెస్టు చేస్తుంటే పెద్దగా గొడవ చేయకుండా సంకెళ్లు వేయించుకున్నాడు.

ఛీ.. థూ, ఇజ్రాయెల్ వ్యక్తిపై ఉమ్మి వేసిన ఐరిష్ మహిళ.. రెస్టారెంట్‌లో దారుణం..
రోడ్డుపై ఆవు అరాచకం.. తల్లి, బిడ్డపై దాడి.. షాకింగ్ వీడియో వైరల్!

సెప్టెంబర్ 20న జరిగిన ఈ ఘటన పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.దానిని రీసెంట్ గా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Advertisement

అప్పటినుంచి అది వైరల్ గా మారింది.కొన్ని నివేదికలను విశ్వసిస్తే, ఈ నేరానికి పాల్పడిన ఈ వ్యక్తికి 30 ఏళ్ల నుంచి జీవిత ఖైదు పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

తాజా వార్తలు