చైనీయులను తెగ ఏడిపిస్తున్న విజయ్ సేతుపతి మహారాజ.. వీడియో వైరల్

ఓటీటీలు రావడంతో సినిమాల థియేటర్ వసూళ్లు చాలా వరకు తగ్గిపోయాయని చెప్పాలి.

ముఖ్యంగా సినిమాలు చాలా తక్కువ రోజుల్లోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో( OTT platforms ) విడుదల కావడంతో, ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లడం చాలావరకు తగ్గించారు.

ఇంట్లోనే సౌకర్యంగా సినిమాలు చూడటానికి ఇస్తా పడుతున్నారు.కానీ, కొన్ని ప్రత్యేక సినిమాలు మాత్రం థియేటర్లలో ప్రేక్షకులను ఆకర్షించడంలో సఫలమవుతున్నాయి.

తాజాగా, తమిళ అగ్రనటుడు విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) నటించిన ‘మహారాజా’ సినిమా ( Maharaja movie )దేశీయంగా మాత్రమే కాదు, అంతర్జాతీయంగా కూడా విశేషమైన విజయాన్ని అందుకుంది.చైనాలో( China ) ఈ సినిమాకు అనూహ్యమైన స్పందన రావడం, ప్రేక్షకులను భావోద్వేగపరచడం సోషల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది.

‘మహారాజా’ చిత్రం 2022 నవంబర్‌లో చైనాలో విడుదలైంది.ఈ సినిమా తండ్రీ-కూతుళ్ల అనుబంధం చుట్టూ తిరుగుతుంది.చైనా ప్రేక్షకులు ఈ భావోద్వేగాన్ని తీవ్రంగా అనుభూతి చెందారు.

Advertisement

థియేటర్లలో కళ్లను చెమర్చించుకుంటూ ఏడుస్తున్న వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ వీడియోలో, థియేటర్‌లో సినిమా చూసిన చైనా ప్రేక్షకులు భావోద్వేగాలతో కంటతడి పెట్టడం కనపడుతుంది.

‘మహారాజా’ చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది.ఈ చిత్రం చైనాలో రూ.91.55 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా.భారతదేశ చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి యు జింగ్ ఈ అద్భుత విజయాన్ని పంచుకున్నారు.

నితిలన్ సామినాథన్ ( Nithilan Saminathan )దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతితో పాటు అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, నట్టి సుబ్రమణ్యం, అభిరామి గోపీకుమార్ వంటి ప్రముఖులు నటించారు.ఈ సినిమాలోని నటన, కథనం, భావోద్వేగాలు ప్రేక్షకులను కదిలించాయి.

భారతీయ చిత్రాలు చైనాలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాయి.తండ్రీ-కూతురు సెంటిమెంట్ లేదా కుటుంబ అనుబంధాలను పునఃసృష్టించే కథలు చైనా ప్రేక్షకుల మనసులను కదిలిస్తున్నాయి.

చైతన్య, శోభిత కాంబోలోలో ఆ సినిమా మిస్సైందా.. సమంత నటించిన ఆ సినిమా ఇదే!
Advertisement

తాజా వార్తలు