వీడియో: స్కూల్‌లో కోడిగుడ్లను దొంగలిస్తూ అడ్డంగా బుక్కైన లేడీ ప్రిన్సిపల్..

సమాజంలో గవర్నమెంట్ ఉద్యోగులకు ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

నెల నెలా డీసెంట్ అమౌంట్ శాలరీగా లభిస్తున్నా ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరు అక్రమదారులు పడుతూ చాలామంది చేత ఛీ కొట్టించుకుంటున్నారు.

ముఖ్యంగా కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలకు వేళకు రాకుండా, పాఠాలు చెప్పకుండా చాలామందికి ఆగ్రహం తెప్పిస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక స్కూల్‌ ప్రిన్సిపాల్ కోడిగుడ్లను దొంగిలిస్తూ పట్టుబడింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా హల్చల్ చేస్తోంది.వివరాల్లోకి వెళ్తే.

నెల్లూరులోని గుడిపల్లిపాడు అప్పర్‌ ప్రైమరీ (ప్రాథమికోన్నత) స్కూల్‌లో మధ్యాహ్న భోజన కార్యక్రమంలో భాగంగా కోడిగుడ్లను పిల్లలకు వండి పెడుతున్నారు.అయితే ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు వాటిని దొంగిలిస్తూ పట్టుబడింది.

Advertisement

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.ఆ వీడియోలో, నాగ భూషణమ్మ అనే గ్రామస్తురాలు ప్రధానోపాధ్యాయురాలి బ్యాగ్‌ని తనిఖీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

అయితే ప్రధానోపాధ్యాయురాలు తన బ్యాగ్‌ను చెక్ చేయనివ్వకుండా వాదించి ప్రతిఘటించింది.అనంతరం గ్రామస్తులు జోక్యం చేసుకుని ప్రధానోపాధ్యాయురాలు బ్యాగును తనిఖీ చేయగా గవర్నమెంట్ లోగో ముద్రించిన 35 గుడ్లు కనిపించాయి.

నెల్లూరు రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం కింద సరఫరా చేసిన కోడిగుడ్లను ప్రధానోపాధ్యాయురాలు ఇంటికి తీసుకెళుతుండగా చూసిన నాగభూషణమ్మ అడ్డుకుంది.ఆమె చేసిన చర్యలపై వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేసింది.

అయితే ప్రధానోపాధ్యాయురాలు మహిళతో వాగ్వాదానికి దిగడంతో తోపులాట జరిగింది.ఈ సంఘటనపై జిల్లా విద్యాశాఖాధికారి విచారణకు ఆదేశించి నివేదిక ఇవ్వాలని కోరారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నెల్లూరులో టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు