కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్ ఢిల్లీలో పార్టీ ఆఫీసు శంకుస్థాపన కోసం వెళ్లి బీజేపీ పెద్దలను వరుస బెట్టి కలిశారు.ముందస్తు సమాచారం ఏమీ కూడా మీడియాకు రిలీజ్ కాకుండా చూసి అనూహ్యంగా అందరినీ కలిసేశారు.
ఆ తర్వాత చాలా కొద్ది రోజులకే మరోసారి ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలు నరేంద్రమోడీ, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులను కలిసి చర్చించారు.దీంతో తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు చెలరేగాయి.
బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటున్నారని అందుకే ఇలా కలిసేందుకు వెళ్లారనే ప్రచరాం పెద్ద ఎత్తున సాగింది.
ఇటు బీజేపీలో కూడా పెను సంచలనాలకు దారి తీసింది ఈ టూర్.
కానీ పైకి మాత్రం అలాంటిదేమీ లేదని రాష్ట్ర బీజేపీ నేతలు కొట్టి పారేశారు.ఒకప్పుడు కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాలపై ఇంట్రెస్ట్ చూపుతున్న విషయం అందరికీ తెలిసిందే.
కేటీఆర్‌ను సీఎం చేసి తాను జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనేది ఆయన ప్లాన్ అని ఎప్పటి నుంచో కథనాలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే ఈరోజు ఓ ప్రముఖ పేపర్‌లో వచ్చిన కథనం పెను సంచలనం రేపుతోంది.
కేసీఆర్ ఢిల్లీ టూర్ వెనక ఓ ప్లాన్ ఉందని, ఆయన ఉప రాష్ట్రపతి కావాలనుకుంటున్నట్టు అందులో పేర్కొంంది.

అంతే కాదు కేటీఆర్‌ను తెలంగాణకు సీఎంను చేసి ఆయన ఢిల్లీకి వెళ్లిపోనున్నట్టు తెలుస్తోంది.గతంలో కూడా కేసీఆర్ ఉపరాష్ట్ర పతి అయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చినా అక్కడితోనే ఆగిపోయాయి.కానీ ఈ సారి మాత్రం కేంద్ర బీజేపీ పెద్దలు కేసీఆర్‌ను ఉప రాష్ట్రపతి చేసేందుకు అభ్యంతరాలు తెలపట్లేదని తెలుస్తోంది.
దాంతో పాటు మూడు కేంద్ర మంత్రి పదవులు కూడా టీఆర్ ఎస్‌కు కట్టబెట్టనున్నట్టు ఈ కథనంలో రాశారు.వీటికి ఒప్పుకుంటే తనకు బీజేపీలో కలిసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని కేసీఆర్ డిమాండ్ చేసినట్టు అందులో ఉంది.
ఇక వెంకయ్య నాయుడు పదవీ కాలం త్వరలోనే ముగియనుండగా తరువాత మరో తెలుగు వ్యక్తిగా కేసీఆర్‌కు ఈ అవకాశం దక్కే చాన్స్ ఉందని ఆ కథనంలో ఉంది.ఇక బీజేపీ కూడా రాబోయే ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాలను ఆధారంగా చేసుకుని అధికారంలో రావాలని చూస్తోంది.
ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతోనే కేసీఆర్‌కు అవాకశం ఇస్తున్నట్టు ఈ కథనం తెలిపింది.చూడాలి మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో.