ఛాన్స్ వస్తే ఐకాన్ స్టార్ తో తప్పకుండ చేస్తానంటున్న స్టార్ డైరెక్టర్!

తమిళ్ స్టార్ డైరెక్టర్లలో వెట్రిమారన్ ( Vetrimaaran ) ఒకరు.

ఈయన కోలీవుడ్ ( Kollywood ) లో మంచి మంచి సినిమాలు చేసి తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను ఏర్పరుచు కున్నాడు.

ఇక ఇప్పుడు ఈయన తమిళ్ లో విడుదలై సినిమాను చేసారు.ఈ సినిమా విడుదల పేరుతో తెలుగులో రిలీజ్ అవుతుంది.

ఈ క్రమంలోనే వెట్రిమారన్ తాజాగా విడుదల ప్రీమియర్స్ సందర్భంగా తెలుగు మీడియాతో ముచ్చటించారు.ఈ సందర్భంగా ఈయన పలు ఆసక్తికర విషయాలను తెలుగు మీడియాతో పంచుకున్నారు.

మన స్టార్ హీరోలతో ఈయన సినిమాలు చేయడంపై ఈయన స్పందించారు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) గురించి కూడా ఈయన కామెంట్స్ చేసారు.

Advertisement

వెట్రిమారన్ మాట్లాడుతూ.ఆడుకాలం మూవీ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను చెన్నైలో కలిశానని.

తమిళ్ లోకి ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదైనా స్టోరీ ఉంటే చెప్పండి సర్ అని అడిగారని అన్నారు.

ఆ తర్వాత వడ చెన్నై మూవీలో అల్లు అర్జున్ కి పవర్ ఫుల్ రోల్ చెప్పానని కానీ అప్పుడు కొన్ని కారణాల రీత్యా కుదరలేదని అలా ఆ సినిమా అల్లు అర్జున్ మిస్ అయ్యాడని తెలిపాడు.అయితే ఆ తర్వాత వడ చెన్నై స్టోరీని మార్చి వివరించారని కానీ ఈ మూవీని అల్లు అర్జున్ మిస్ చేసుకున్నారు.ఇక ముందు ముందు అయినా అల్లు అర్జున్ తో అవకాశం వస్తే తప్పకుండ సినిమా చేస్తానని తెలిపారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) పుష్ప 2 ( Pushpa 2 ) సినిమాను చేస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను బడ్జెట్ పరంగా ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి మొన్ననే ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయ్యి సూపర్ టాక్ తెచ్చుకుంది.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

పార్ట్ 1 లో ఉన్న పాత్రలే కాకుండా పార్ట్ 2 లో సరికొత్త పాత్రలను కూడా పుష్ప 2 లో పరిచయం చేయబోతున్నాడు సుకుమార్.మరి ఈ పార్ట్ 2 లో భాగం అయ్యే ఆ స్టార్స్ ఎవరు ముందు ముందు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు