ఆ మూవీ రీమేక్ లో నటించనున్న వెంకీ పవన్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలకు ప్రాధాన్యత పెరుగుతోంది.

మల్టీస్టారర్ సినిమాల ద్వారా నవ్యత ఉన్న కథలను తెరకెక్కించే అవకాశం ఉండటంతో దర్శకులు సైతం ఈ తరహా కథలపై ఆసక్తి చూపుతున్నారు.

ఇండస్ట్రీ వర్గాల సమచారం ప్రకారం మరో భారీ మల్టీస్టారర్ సినిమా అతి త్వరలో తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.గతంలో పవన్ కళ్యాణ్ వెంకటేష్ కాంబినేషన్ లో గోపాలగోపాల సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా, వెంకటేష్ నాస్తికుడిగా నటించగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా అబవ్ యావరేజ్ గా నిలిచింది.మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాలో పవన్, వెంకటేష్ నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో, వెంకటేష్ నారప్ప సినిమాలో నటిస్తున్నారు.పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ స్టార్ హీరోలతో వరుస కమిట్మెంట్లు ఉన్నాయి.

Victory Venkatesh Crazy Multistarrer With Pawan Kalyan Pawan Kalyan, Venkatesh,
Advertisement
Victory Venkatesh Crazy Multistarrer With Pawan Kalyan Pawan Kalyan, Venkatesh,

పవన్ కళ్యాణ్, వెంకటేష్ నుంచి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది.హారిక హాసిని క్రియేషన్స్ దగ్గర ఈ సినిమా హక్కులు ఉండటంతో ఆ బ్యానర్ పైనే త్రివిక్రమ్ లేదా మరో స్టార్ డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి.తమిళంలో పార్థిబన్, కార్తీ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా విషయమై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.అజ్ఞాతవాసి సినిమా విడుదల తరువాత రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరమైన పవన్ మళ్లీ వరుస సినిమాలతో బిజీ కావడంతో ఆయన అభిమానులు సంతోషంగా ఉన్నారు.

కరోనా, లాక్ డౌన్ వల్ల షూటింగ్ వాయిదా పడుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.వచ్చే నెల తొలి వారం నుంచి వెంకటేష్ నారప్ప సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని సమాచారం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు