యాంగ్రీ యంగ్ మెన్ తో మర్మాణువు చేస్తున్న వెంకటేష్ మహా

కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో వరుసగా రెండు సూపర్ హిట్స్ అందుకొని టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వెంకటేష్ మహా.ఈ యంగ్ టాలెంటెడ్ దర్శకుడు మొదటి సినిమాని డిఫరెంట్ జోనర్ లో అంతాలజీగా ప్రెజెంట్ చేసి అందరిని మెప్పించాడు.

 Venaktesh Maha Next Movie With Rajasekhar, Marmanuvu Movie, Tollywood, Praveena-TeluguStop.com

తరువాత మలయాళీ సూపర్ హిట్ మూవీని తీసుకొని దానిని ఉమామహేశ్వరగా మార్చి సత్యదేవ్ కెరియర్ లో సాలిడ్ హిట్ అందించాడు.ఈ రెండు సినిమాలతో మంచి విషయం ఉన్న దర్శకుడుగా అలాగే కంటెంట్ బేస్ కథలకి ప్రాధాన్యత ఇచ్చే డైరెక్టర్ గా వెంకటేష్ మహాకి మంచి గుర్తింపు వచ్చింది.

ఈ నేపధ్యంలో అతని మూడో సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయం అందరిలో ఆసక్తి నెలకొంది.ఈ నేపధ్యంలో వెంకటేష్ మహా తన మూడో సినిమాని తాజాగా ఎనౌన్స్ చేశాడు.

యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ తో వెంకటేష్ తన మూడో సినిమాని అఫీషియల్ గా ప్రకటించాడు.

మర్మాణువు టైటిల్ పోస్టర్ ని కాన్సెప్ట్ ఇమేజ్ తో తాజాగా రిలీజ్ చేసి తన సినిమాని వెంకటేష్ ఎనౌన్స్ చేశాడు.

పోస్టర్ చూస్తూ ఉంటేనే మూడో సినిమాని కూడా వినూత్న కథాంశం ఏదో వెంకటేష్ చెప్పబోతున్నాడు అని అనిపిస్తుంది.కంచరపాలెం నిర్మాత ప్రవీణ పరుచూరి మరోకరితో కలిసి ఈ సినిమాని నిర్మిస్తుంది.

జీవిత రాజశేఖర్ కూడా ఈ సినిమాలో భాగం అవుతున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే రాజశేఖర్ శేఖర్ అనే సినిమాని కొత్త దర్శకుడుతో చేస్తున్నాడు.

అలాగే మరో యంగ్ టాలెంటెడ్ దర్శకుడుతో సినిమా చేస్తున్నాడు.ఇప్పుడు వెంకటేష్ తో మూడో సినిమాని కన్ఫర్మ్ చేసేశాడు.

మొత్తానికి యాంగ్రీ యంగ్ మెన్ కరోనా నుంచి కోలుకున్నాక రెగ్యులర్ కథలని పూర్తిగా పక్కన పెట్టి కొత్త దర్శకులతో, కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నట్లు అనిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube