వీర్ సావర్కర్ బయోపిక్ తెరపైకి... హిందుత్వ ఎజెండాతోనే

వీర్ సావర్కర్ అంటే ఇండియాలో తెలియని వారు ఉండరు.గాంధీజీ స్వాతంత్ర్య ఉద్యమం పోరాటం సమయంలోనే వీర్ సావర్కర్ ఉన్నారు.

గాంధీజీ సిద్దాంతాలకి విరుద్ధంగా హిందుత్వ వాదంతో సావర్కర్ స్వాతంత్ర్య ఉద్యమ పోరాటం జరిగింది.ఈ కారణంగానే కాంగ్రెస్ వాదులు అతన్ని స్వాతంత్ర్య వ్యతిరేకిగా ముద్ర వేశారు.

అయితే బీజేపీ పార్టీ సావర్కర్ సిద్దాంతాలతో స్టార్ట్ అయ్యి అతన్ని నేషనల్ హీరోగా రిప్రజెంట్ చేస్తూ వచ్చింది.అలా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీర్ సావర్కర్ గొప్పతనం కూడా భారతీయులకి తెలిసిందే.

ఇప్పటికి ముస్లిం, క్రిస్టియన్ వర్గాలు వీర్ సావర్కర్ ని జాతీయవాది అంటే అంగీకరించరు.దీంతో సిద్దాంతాల పరంగా బీజేపీకి ఈ రెండు వర్గాలు దూరం అయ్యాయి.

Advertisement

అయితే హిందుత్వ ఎజెండాని దేశంలో విస్తరించాలని బీజేపీ పార్టీ తనకున్న అన్ని మార్గాలని ఉపయోగించుకుంటుంది.అలాగే హిందుత్వ వాదం ప్రజలలోకి బలంగా తీసుకెళ్లడానికి ఇప్పుడు బాలీవుడ్ లో వీర్ సావర్కర్ బయోపిక్ కి రంగం సిద్ధమైంది.

తెలుగులో పలు సినిమాలలో విలన్ గా నటించిన బాలీవుడ్ దర్శకుడు మహేష్ మంజ్రేకర్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేసి వీర్ సావర్కర్ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నట్లు ఎనౌన్స్ చేశారు.

అయితే ఈ మూవీ ఎనౌన్స్ చేసినంత ఈజీగా తెరకెక్కడం అంటే కష్టంతో కూడుకున్న బాద్యత అని చెప్పాలి.టైటిల్ రోల్ కోసం ఇప్పుడు ఏ హీరో ముందుకొస్తాడు అనేది చూడాలి.

అలాగే ఈ మూవీకి కచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో పాటు ముస్లిం, క్రిస్టియన్ సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు