‘లియో’ థియేటర్స్ లో ‘VD13’ టీజర్.. దిల్ రాజు ప్లానింగ్ మామూలుగా లేదుగా!

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) గురించి తెలియని వారు లేరు.

ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దీ సమయంలోనే భారీ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.

పెళ్లి చూపులు సినిగుర్తింపు పొందిన విజయ్ ఒక్కో సినిమాతో క్రేజ్ పెంచుకుంటూ వచ్చాడు.అయితే ఈయన కెరీర్ లో హిట్స్ కంటే ప్లాప్స్ ఎక్కువుగా ఉన్నప్పటికీ ఈయన క్రేజ్ మాత్రం తగ్గలేదు.

లైగర్ ( Liger ) వంటి పాన్ ఇండియన్ సినిమాతో భారీ హిట్ కొట్టాలని అనుకోగా ఇది దారుణంగా నిరాశ పరిచింది.ఇక ఇటీవలే ఖుషి సినిమాతో( Kushi Movie ) వచ్చి మంచి హిట్ అందుకున్నాడు.

ఈ సినిమా ఇచ్చిన జోష్ లోనే విజయ్ నెక్స్ట్ రెండు సినిమాలను ప్రకటించి వేగంగా షూట్ కూడా పూర్తి చేస్తున్నాడు.మరి విజయ్ చేస్తున్న ప్రాజెక్ట్స్ లో పరశురామ్ తో చేస్తున్న ప్రాజెక్ట్ ఒకటి.

Advertisement

విజయ్ కు గీతా గోవిందం వంటి ఘన విజయం అందించిన పరశురామ్ తో( Parashuram ) మరోసారి చేతులు కలిపాడు. VD13 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ శరవేగంగా పూర్తి అవుతుంది.మరో వైపు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయడానికి సిద్ధం అయ్యారు.

ఈ సినిమా నుండి టైటిల్ అండ్ టీజర్ ను 18న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

మరి తాజాగా అందుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా టీజర్ ను అక్టోబర్ 19న రిలీజ్ కాబోతున్న విజయ్ దళపతి లేటెస్ట్ మూవీ లియో( Leo Movie ) రిలీజ్ అవుతున్న థియేటర్స్ లో ప్రదర్శితం చేయనున్నారట.దీంతో దిల్ రాజు( Dil Raju ) పెద్ద ప్లాన్ నే వేసాడు.టీజర్ తోనే భారీ ప్రమోషన్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.

ఇక రేపు రిలీజ్ కాబోతున్న ఈ టీజర్ తోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయబోతున్నారు.ఈ సినిమాలో విజయ్ కు జోడిగా మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

ఇక గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు