రూటు మారుస్తున్న వరుణ్ తేజ్.. బోర్ కొట్టేసిందట!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గతకొంత కాలంగా ఒకే తరహా యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ వస్తున్నాడు.దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

 Varun Tej Next Movie To Be Romantic Entertainer, Varun Tej, Gaddalakonda Ganesh,-TeluguStop.com

అయితే ఈ సినిమా తరువాత వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బాక్సర్’ పూర్తి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్నా, ఇందులోనూ యాక్షన్ అంశాలు పుష్కలంగా ఉండబోతున్నాయి.దీంతో వరుసగా యాక్షన్ చిత్రాలను తెరకెక్కిస్తున్న వరుణ్ తేజ్, ఇప్పుడు తన రూటు మార్చాలని చూస్తున్నాడు.

ఈ క్రమంలోనే తన నెక్ట్స్ మూవీని పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాలని చూస్తున్నాడు.దర్శకుడు సాగర్ చంద్ర డైరెక్షన్‌లో రాబోయే సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గర చేయాలని వరుణ్ భావిస్తున్నాడు.

ఇక సాగర్ చంద్ర గతంలో తెరకెక్కించిన అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆయన డైరెక్షన్‌లో వరుణ్ తేజ్‌తో చేయబోయే సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.కాగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో నెలకొంది.

ఇక వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బాక్సర్ షూటింగ్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఈ సినమా కోసం వరుణ్ తేజ్ ఇప్పటికే ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో కోచింగ్ తీసుకుంటున్నాడు.

ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకునేందుకు వరుణ్ తేజ్ రెడీ అవుతున్నాడు.మరి ఈ సినిమాతో వరుణ్ సక్సెస్ పంచ్ కొడతాడా లేడా అనేది చూడాలి.

ఏదేమైనా వరుసగా ఒకేతరహా చిత్రాలతో బోర్ కొట్టి ఇప్పుడు రొమాంటిక్ చిత్రాలపై వరుణ్ ఆసక్తి చూపుతున్నాడని పలువురు కామెంట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube