పవిత్రమైన వైకుంఠ చతుర్దశి రోజు.. గల శుభ అశుభ సమయాలు ఇవే..!

ముఖ్యంగా చెప్పాలంటే దృక్ పంచాంగం ప్రకారం, నవంబర్ 25 వ తేదీన శనివారం రోజు చాలా భక్తులు శుక్ల పక్షంలోని త్రయోదశి మరియు చతుర్దశి తిథిలను ఆచరిస్తారు.

ఈ పవిత్రమైన రోజున వైకుంఠ చతుర్దశి( Vaikuntha Chaturdashi ) మరియు విశ్వేశ్వర వ్రతం( Visweshwara Vratam ) అనే రెండు ప్రత్యేక పండుగలు జరుపుకుంటారు.

హిందూ క్యాలెండర్‌ ప్రకారం వైకుంఠ చతుర్దశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఇది కార్తీక పూర్ణిమకు ఒక రోజు ముందు వస్తుంది.

కార్తీక మాసంలో శుక్ల పక్ష చతుర్దశిని విష్ణువు మరియు శివుని భక్తులు గౌరవిస్తారు.ఈ ఇద్దరు దేవతలను ఒకే రోజున కలిసి పూజిస్తారు.

అలాగే ఈ పవిత్రమైన రోజు శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

నవంబర్ 25 వ తేదీన సూర్యోదయం 6:51 నిమిషములకు మరియు 5:24 నిమిషములకు సూర్యాస్తమయం అవుతుంది.చంద్రుడు మధ్యాహ్నం 3:51 నిమిషములకు కనిపిస్తాడు.త్రయోదశి తిథి సాయంత్రం 5:22 నిమిషముల వరకు ఉంటుంది.నవంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 2:56 నిమిషముల వరకు శుభప్రదమైన అశ్వినీ నక్షత్రం( Ashwini Nakshatram ) ఉంటుంది.ఆ తరువాత సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటాడని, చంద్రుడు మేష రాశిలో ఉంటాడని పండితులు అంచనా వేస్తున్నారు.

ఈ పవిత్రమైన రోజున బ్రహ్మ ముహూర్తం( Brahma Muhurtam ) ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషముల నుంచి 5 గంటల 58 నిమిషాల వరకు ఉంటుంది.

అలాగే ప్రాత సంధ్య కాలం ఉదయం 5:31 నిమిషముల నుండి నిమిషముల వరకు ఉంటుంది.అలాగే గోధూలీ ముహూర్తం సాయంత్రం 5:22 నిమిషముల నుండి నిమిషముల వరకు ఉంటుంది.నిశిత ముహూర్తం నవంబర్ 26 తేదీన రాత్రి 11:41 నిమిషముల నుండి 12:35 నిమిషముల వరకు ఉంటుంది.అలాగే రాహుకాలం ఉదయం 9:30 నిమిషముల నుండి 10:49 నిమిషముల వరకు, యమగండ మధ్యాహ్నం 1:27 నిమిషముల నుండి 2:46 నిమిషముల వరకు ఉంటుంది.అలాగే దుర్ముహూర్తం ముహూర్తం ఉదయం 6 గంటల 51 నిమిషముల నుండి 7:34 నిమిషముల వరకు ఉంటుంది.ఆ తర్వాత మళ్లీ ఉదయమే 7:34 నిమిషముల నుండి 8:16 నిమిషముల మధ్య ఉంటుందని పండితులు చెబుతున్నారు.

ఇష్టం లేకున్నా.. అమల సినిమాల్లోకి ఎలా వచ్చిందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు