అలీతో సరదాగా షోకు అప్పుడే వస్తానని చెబుతున్న వడ్డే నవీన్.. ఏమైందంటే?

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన వడ్డే నవీన్ అలీతో సరదాగా షోకు రావాలని అభిమానులు కోరుకుంటున్న సంగతి తెలిసిందే.

ఈ మధ్య కాలంలో వడ్డే నవీన్ సినిమాలలో ఎక్కువగా నటించడం లేదు.

అలీతో సరదాగా షో కొత్త ప్రోమో ఎప్పుడు విడుదలైనా వడ్డే నవీన్ ను ఈ షోకు పిలిపించాలని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.ఈ కామెంట్లు ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న అలీతో పాటు ఈ షో నిర్వాహకుల దృష్టికి కూడా వచ్చాయని బోగట్టా.

అయితే తాజాగా ఒక వీడియో ద్వారా అటు అలీ ఇటు వడ్డే నవీన్ స్పందించి వేర్వేరు విషయాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు.నేను ఏదైనా ఒక అద్భుతం చేసి అలీతో సరదాగా షోకు రావాలని అనుకుంటున్నానని వడ్డే నవీన్ చెప్పారని అలీ చెప్పుకొచ్చారు.

వడ్డే నవీన్ అలీతో సరదాగా షోకు రానని మాత్రం ఎప్పుడూ చెప్పడని వస్తాననే చెబుతాడని అలీ కామెంట్లు చేశారు.వడ్డే నవీన్ చిన్నప్పటి నుంచి అతనితో నాకు స్నేహం ఉందని అలీ తెలిపారు.

Advertisement

చెన్నైలో నేను, వడ్డే నవీన్ ఒకే వీధిలో ఉండేవాళ్లమని అలీ చెప్పుకొచ్చారు.

నా తండ్రి పెద్ద నిర్మాత అనే గర్వం వడ్డే నవీన్ లో ఎప్పుడూ ఉండదని ఆయన అన్నారు.స్నేహానికి ఎంతో విలువ ఇచ్చేవారని అలీ అన్నారు.వడ్డే నవీన్ కూడా అలీ చెప్పిన విషయాలు నిజమేనని వీడియోలో వెల్లడించడంతో అలీతో సరదాగా షోలో వడ్డే నవీన్ ను చూడటానికి ఎంతో సమయం పట్టదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

వడ్డే నవీన్ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆయనకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుని వడ్డే నవీన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.వడ్డే నవీన్ కు స్టార్ డైరెక్టర్లు మంచి పాత్రలను ఆఫర్ చేయలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?
Advertisement

తాజా వార్తలు