వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాలకే వ్యాక్సిన్ సరఫరా !

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తూనే ఉంది.

ఇప్పటికే ఈ వైరస్ పై అన్ని దేశాల శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ని కనుగొని క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహిస్తున్నారు.

కొన్ని వ్యాక్సిన్లకు క్లినికల్ ట్రయల్స్ చివరిదశకు చేరుకున్నాయి.ఈ మేరకు టీకా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాలు అనుమతులు కూడా జారీ చేశాయి.

సెప్టెంబర్ లేదా అక్టోబర్ చివరి నాటికి కొన్ని టీకాలు మార్కెట్ లో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉత్పత్తి చేసిన టీకాలను ఎవరికి మొదటగా పంపిణీ చేయాలనే ఆలోచనలో నిమగ్నమైంది.

కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఎవరికి మొదటగా టీకాలు ఇవ్వాలనే దానిపై సంధిక్తత నెలకొంది.దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు కూడా కొనసాగుతున్నాయి.

Advertisement

అయితే దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలకు ప్రాధాన్యతను ఇవ్వాలని సంపన్న దేశాలకు సూచించింది.కరోనా వైరస్ బారిన పడిన వారికి ఆరోగ్య సమస్యలు, ఎవరిపై ఈ వైరస్ ఎక్కువగా దాడి చేస్తోందో, మరణాల రేటు ఏ దేశంలో ఎక్కువగా నమోదవుతోంది వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ ఆరోగ్య నిపుణుల ఆధ్వర్యంలో ఓ నివేదికను రూపొందించారు.19 మంది ఉన్న ఈ నిపుణుల్లో పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన ఎజెకీల్ జే ఎమ్మాన్యూల్ అధ్యక్షత వహిస్తున్నాడు.కాగా, వాక్సిన్ ను మూడు దశల్లో పంపిణీ చేయాలని నివేదికలో సమర్పించారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు