2024 సంవత్సరం బిగ్గెస్ట్ హిట్లలో పుష్ప ది రూల్( Pushpa The Rule ) మూవీ కూడా ఒకటని చెప్పడంలో సందేహం అవసరం లేదు.పుష్ప ది రూల్ సినిమా వల్లే మా సినిమా ఆడలేదు అంటూ బాలీవుడ్ యంగ్ హీరో ఉత్కర్ష్ శర్మ( Utkarsh Sharma ) కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మా సినిమా విషయంలో ఎక్కడ తప్పు జరిగిందనే దానిపై నాకు ఒక అవగాహన వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.మూవీ రిలీజ్ డేట్ విషయంలో మేము ఇంకొంచెం ఆలోచించాల్సి ఉండాల్సిందని ఆయన తెలిపారు.
పుష్ప ది రూల్, బేబీ జాన్ సినిమాలు సైతం అదే సమయంలో రిలీజ్ అయ్యాయని ఆ సినిమాల మధ్య మా సినిమా నలిగిపోయిందని ఉత్కర్ష్ శర్మ తెలిపారు.అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకు చేరువ కాకముందే సరైన స్క్రీన్లు దొరకక మా సినిమా చనిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ వార్ లో నిలవడానికి మా సినిమా ఎంతో ఇబ్బంది పడిందని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

తొలి వారంలో మా సినిమాకు మంచి టాక్ వచ్చినా ఆ తర్వాత స్క్రీన్లు దొరకలేదని ఆయన పేర్కొన్నారు.అది కలెక్షన్లపై ప్రభావం చూపించిందని దాని వల్లే మా సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదని ఉత్కర్ష్ శర్మ అన్నారు.ఒకేసారి రెండు, మూడు సినిమాలను చూడటానికి అవసరమైన స్క్రీన్స్ మన దేశంలో తక్కువగా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.

వనవాస్( Vanvaas Movie ) కు ఓటీటీలో వస్తున్న రెస్పాన్స్ గురించి కూడా ఆయన రియాక్ట్ కావడం జరిగింది.ఓటీటీలో మా సినిమా బాగా ఆడిందని ప్రేక్షకుల నుంచి మంచి రివ్యూలు వచ్చాయని ఆయన వెల్లడించారు.ఓటీటీలో స్క్రీన్ వార్స్ ఉండకపోవడంతో ఇక్కడ అంతా మంచిగానే జరిగిందని ఆయన తెలిపారు.అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఈ హీరో కామెంట్స్ విషయంలో ఫీలవుతున్నారు.