నిరుపయోగంగా హైస్కూల్ మరుగుదొడ్లు

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధి హామీ పథకం కింద గతంలో నాలుగు మరుగుదొడ్లు నిర్మించారు.

అప్పుడు పాఠశాలలో స్వీపర్లు ఉండడంతో వాటిని శుభ్రంగా ఉంచేవారు.

గత ప్రభుత్వం వారిని తొలగించడంతో నిర్వహణ కొరవడి అధ్వాన్నంగా తయారై నిరుపయోగంగా మారాయి.పాఠశాల విద్యార్థుల కోసం ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన మరుగుదొడ్లు పనికిరాకుండా పోవడంతో విద్యార్దులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలలో నిరూపయోగంగా పడావు పడిన మరుగుదొడ్లకు చిన్న చిన్న మరమ్మతులు చేయించి,వాటి నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి విద్యార్థుల ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.

Advertisement

Latest Video Uploads News