అమెరికాలో స్త్రీ, పురుషుల మధ్య వేతన వ్యత్యాసం .. 60 ఏళ్లలో మహిళలు ఎంత కోల్పోయారో తెలుసా..?

అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ( Statue Of Liberty ) భారీ విగ్రహం స్వేచ్ఛ, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుంది.

జాతి, మతం, ప్రాంతం, రంగు వంటి వివక్ష లేకుండా దేశ ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు, దేశంలోని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతికేందుకు ఈ ప్రతిమ పూచీకత్తు వహిస్తుంది.

కానీ ఆచరణలో ఇది అంతా ఎండమావిగానే కనిపిస్తుందన్నది విజ్ఞుల మాట.ఓ ప్రయోజనం, ఓ సంకల్పం నుంచి పుట్టిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దేశంలోని ఈ వివక్షను కళ్ళప్పగించి చూడటం మినహా ఏమీ చేయలేకపోతోంది.ఇది అమెరికా( America ) సమాజానికి తలవంపులు తెచ్చే వ్యవహారమే.

అగ్రరాజ్యంగా, ప్రపంచ పెద్దన్నగా, అత్యంత సంపన్న దేశమైన అమెరికాలో స్త్రీ, పురుషుల మధ్య వివక్ష వున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

Us Women Have Lost 61 Trillion Dollars In Wages Due To Gender Pay Gap In Last 60

అమెరికాలో దాదాపు 60 ఏళ్లుగా సమానవేతన చట్టం అమల్లో వుంది.కానీ అగ్రరాజ్యంలో నేటికీ జాతి, లింగ, వేతన వ్యత్యాసాలు వున్నాయని ఒక నివేదిక సంచలన వాస్తవాలను బయటపెట్టింది.ముఖ్యంగా అమెరికన్ మహిళలు సమాన వేతనం( Equal Pay ) విషయంలో మూల్యం చెల్లించుకుంటున్నారని సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్( Centre For American Progress ) చేసిన పరిశోధనలో తేలింది.1967 నుంచి యూఎస్‌లోని మహిళా శ్రామికులు లింగ వ్యత్యాసం కారణంగా 61 ట్రిలియన్ల ఆదాయాన్ని కోల్పోయినట్లు నివేదిక తెలిపింది.అమెరికా ప్రభుత్వ రుణం 31 ట్రిలియన్ డాలర్ల కంటే కూడా ఈ మొత్తం రెండు రెట్లు ఎక్కువ.

Us Women Have Lost 61 Trillion Dollars In Wages Due To Gender Pay Gap In Last 60
Advertisement
US Women Have Lost 61 Trillion Dollars In Wages Due To Gender Pay Gap In Last 60

1963లో సమానవేతన చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేశంలో స్త్రీ, పురుషుల మధ్య జీతంలో అంతరాన్ని పరిశోధకులు గుర్తించారు.2021లో ఏడాది పొడవునా పూర్తి సమయం పనిచేసిన పురుషులు సగటున ఒక డాలర్ సంపాదిస్తే.మహిళలకు మాత్రం 84 సెంట్లు మాత్రమే దక్కింది.

ఇది 1963లో 59 సెంట్లుగా వుంది.స్త్రీ, పురుషుల మధ్య వేతన సమానత్వం 2056 వరకు జరగదని నివేదిక హెచ్చరించింది.2021లో పూర్తి సమయం పనిచేసిన స్త్రీలు పురుషులతో పోలిస్తే 9,954 డాలర్లు తక్కువ అందుకున్నారు.ఇది మహిళల ఆర్ధిక భద్రతకు ప్రతికూలమని సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్‌లోని ఆర్ధిక విశ్లేషణ డైరెక్టర్ రోజ్ ఖట్టర్( Rose Khattar ) అన్నారు.

వేతన వ్యత్యాసాల ప్రతికూల ఆర్ధిక పరిణామాలను మహిళలు మరో 30 ఏళ్ల పాటు భరించలేరని ఆమె స్పష్టం చేశారు.విధాన నిర్ణేతలు.పేచెక్ ఫెయిర్‌నెస్ చట్టాన్ని ఆమోదించడంతో సహా వేతన వ్యత్యాసాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని రోజ్ పేర్కొన్నారు.

గడ్డకట్టే నీళ్లలో 9 రోజులు ఆగకుండా ఈతకొట్టిన ఎలుగుబంటి.. ఎన్ని కి.మీ ప్రయాణించిందంటే..?
Advertisement

తాజా వార్తలు