ఆ విషయంలో భారత్ నిర్ణయాన్ని స్వాగతించిన అమెరికా...!

రోజురోజుకీ భారత్ అమెరికా దోస్తీ బలపడుతోంది.ఏదేశం ఎలా వున్నా.

అమెరికా మాత్రం మన దేశ చర్యలను మొదటినుండి ఓహో అంటుంది.

ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం తాజాగా నిషేధించిన మరో 118 చైనీస్ యాప్స్ ను ఉద్దేశించి అమెరికా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యింది.

అవును.భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా బల్ల గుద్ది మరీ సమర్థించింది.

యాప్స్‌ను బ్యాన్ చేసి ఇండియా మంచి పని చేసిందని అమెరికా అండర్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ కెయిత్ క్రాక్ పేర్కొన్నారు.ఇండియా గతంలో 59 యాప్స్ ను బ్యాన్ చేసిన సంగతి విదితమే.ఇందులో టిక్ టాక్ ఒకటి.

Advertisement

దానితోనే టిక్ టాక్ పతనం స్టార్ట్ అయ్యింది.ఇపుడు ఆ కంపెనీ తమను ఎవరు కొంటారా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

భారత్ తీసుకున్న తాజా నిర్ణయాలపై ప్రపంచ దేశాలు తొంగి చూస్తున్నాయి.ఇప్పుడు అమెరికా కూడా అదే బాటలో పయనించడం కొసమెరుపు.

కాగా ఇండియా ఇప్పటికే 100కు పైగా చైనా యాప్స్ ను బ్యాన్ చేసేసింది.

ఈ నేపథ్యంలోనే అమెరికా అండర్ సెక్రెటరీ కెయిత్ క్రాక్ భారత్ ను ఉద్దేశించి, భారత్ ను ఆదర్శంగా తీసుకొని, పరాయి దేశాల యాప్స్ నుంచి స్వాతంత్య్రం కోరుకునే దేశాలన్నీ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.అందరూ కలిసి ఏకతాటిపై నడిచి కలసి కట్టుగా పనిచేసి, క్లీన్ నెట్‌వర్క్‌ ను సృష్టించాలని అన్నారు.కాగా అమెరికా ప్రభుత్వం ఈ ఏడాది ఆరంభంలోనే క్లీన్ నెట్‌వర్క్ ప్రోగ్రామ్ ‌ను ఆవిష్కరించింది.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
కోటి ఆశలతో స్వదేశానికి బయలుదేరిన ఎన్నారై మహిళ... అంతలోనే విషాదం..?

క్లీన్ నెట్‌ వర్క్ ప్రోగ్రామ్ అంటే అర్ధం.డేటా ప్రైవసీనే.

Advertisement

ఇందులో భారత్ ముందడుగులో ఉండడం గమనార్హం.

తాజా వార్తలు