ట్రంప్‌కు జైకొట్టిన డెమొక్రాట్ మాజీ నేత తులసీ గబ్బార్డ్.. ఆ ధైర్యం ఆయనకే ఉందంటూ వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్( Kamala Harris ) దూకుడుగా ముందుకెళ్తుండటంతో ట్రంప్ శిబిరం డల్ అయ్యింది.

ఈ నేపథ్యంలో ఆయనకు కీలక వ్యక్తి మద్ధతు లభించింది.డెమొక్రాటిక్ పార్టీ మాజీ నేత తులసీ గబ్బార్డ్( Tulsi Gabbard ).

ట్రంప్‌కు తన మద్ధతు ప్రకటించారు.ఈ మేరకు సోమవారం డెట్రాయిట్‌లో జరిగిన ప్రచార కార్యక్రమంలో ట్రంప్‌తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తులసీ గబ్బార్డ్ మాట్లాడుతూ.డెమొక్రాట్ల పాలనలో ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతున్నాయని విమర్శించారు.ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan )నుంచి అమెరికా సైనిక బలగాలు వైదొలగిన విధానాన్ని ఆమె తప్పుబట్టారు.

Advertisement

ట్రంప్ యుద్ధాన్ని చివరి అస్త్రంగా పరిగణనలోనికి తీసుకుంటారని తులసీ ప్రశంసించారు.శాంతి సాధన కోసం శత్రువులు, మిత్రులు, నియంతలు, భాగస్వాములు వంటి తారతమ్యాలు లేకుండా అందరినీ కలిసే ధైర్యం డొనాల్డ్ ట్రంప్‌కు మాత్రమే ఉందన్నారు.

అధ్యక్షుడిగా, కమాండర్ ఇన్ చీఫ్‌గా దేశంలోని ప్రతి పౌరుడి జీవితానికి బాధ్యత వహించాలనే విషయం ఆయనకు బాగా తెలుసునని పేర్కొన్నారు.

కాగా.2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ నామినేషన్ కోసం కమలా హారిస్ , తులసి గబ్బార్డ్‌లు హోరాహోరీగా తలపడ్డారు.చివరికి డిసెంబర్ 2019లో కమలా హారిస్, 2020 మార్చిలో తులసి గబ్బార్డ్‌లు రేసు నుంచి తప్పుకున్నారు.

డొనాల్డ్ ట్రంప్‌తో చాలా ఏళ్లుగా స్నేహంగా ఉంటోన్న ఆమె ఒకానొక దశలో ట్రంప్ రన్నింగ్‌మెట్ అవుతారని అమెరికన్ మీడియాలో కథనాలు వచ్చాయి.కొద్దిరోజుల క్రితం ట్రంప్ ప్రచార ప్రతినిధి కరోలిన్ లీవిట్ .ఒక ఈ మెయిల్‌లో గబ్బర్డ్ రాకను ధృవీకరించినట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.విధాన సలహాదారులు, తులసి గబ్బార్డ్ వంటి ప్రభావంతమైన వ్యక్తులతో ట్రంప్ సమావేశాలను కొనసాగిస్తారని లీవిట్ వెల్లడించారు.2016, 2020 నాటి అధ్యక్ష ఎన్నికలను మించి ఈసారి డిబేట్‌ల కోసం ట్రంప్ ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

భారతీయులపై అమెరికన్ విషం.. 'H1B వైరస్' అంటూ.. వీడియో చూస్తే రక్తం మరిగిపోతుంది!
Advertisement

తాజా వార్తలు