బైడెన్ కుమారుడు హంటర్ ‘‘ ఆర్ట్ ’’ సేల్‌: అన్నీ తానై నడిపిస్తున్న వైట్ హౌస్, విమర్శలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ పెయింటింగ్స్ వేలానికి సంబంధించిన ఒప్పందాలను రహస్యంగా వుంచేందుకు బ్రోకర్‌కు సాయం చేసిందన్న ఆరోపణలపై వైట్ హౌస్ స్పందించింది.

హంటర్ బైడెన్ వేసిన పెయింటింగ్స్‌ 5,00,000 డాలర్ల వరకు వేలంలో అమ్ముడుపోతాయని అంచనా.

ఎవరైనా వీటిని కొనుగోలు చేయాలంటే ఈ విషయాన్ని గోప్యంగా వుంచుతామని వైట్‌హౌస్ తెలిపింది.ఉక్రెయిన్, చైనా, ఇతర ప్రాంతాల్లో హంటర్ బైడెన్ వ్యాపార ఒప్పందాలు చేసుకున్నారంటూ గతంలో రిపబ్లికన్లు తీవ్రంగా విమర్శించారు.

అయితే ఈ ఆరోపణలను తండ్రి కొడుకులు ఖండించారు.హంటర్ ప్రస్తుతం ఫెడరల్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తును ఎదుర్కొంటున్నాడు.

అయినప్పటికీ తాను 100 శాతం నిర్దోషిగా బయటపడతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఆర్ట్ సేల్‌లో వైట్‌హౌస్ పాత్రపై మీడియా ప్రశ్నించగా.

Advertisement

శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ స్పందించారు.హంటర్ బైడెన్ తన వృత్తిలో సహేతుకమైన భద్రతలో పనిచేయడానికి అనుమతించే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిపారు.

నిజానికి హంటర్ అధ్యక్షుడి కొడుకైనా ఎలాంటి వృత్తినైనా చేసుకునే హక్కు వుంది.అలాగే కళాత్మక వృత్తిని కొనసాగించుకునేందుకు ఆయనకు హక్కు కూడా వుందని జెన్ సాకీ స్పష్టం చేశారు.

ఒక ప్రొఫెషనల్ గ్యాలరీ యజమాని హంటర్ బైడెన్ కళాకృతులపై ధరలను నిర్ణయిస్తారని జెన్ సాకీ తెలిపారు.దీనితో పాటు లావాదేవీలను సైతం ఆయనే నిర్వహిస్తారని వెల్లడించారు.

అమ్మకపు ధర కంటే ఏదైనా ఎక్కువ వున్నా, అనుమానాస్పదంగా అనిపించినా ఆ వ్యక్తికి వేలంలో పాల్గొనే అర్హత వుండదని ఆమె తెలిపారు.అయితే బరాక్ ఒబామా కాలంలో ఎథిక్స్ చీఫ్‌గా పనిచేసిన వాల్టర్ షాబ్.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

ఈ ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.ఇది వైట్‌హౌస్ పారదర్శకతపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.

Advertisement

హంటర్ బైడెన్ తొలి సోలో ఎగ్జిబిషన్, వేలం అక్టోబర్‌లో న్యూయార్క్‌లోని జార్జ్ బెర్గెస్ గ్యాలరీలో ఏర్పాటు చేశారు.ఇక్కడ ఆయన వేసిన ఆయిల్, యాక్రిలిక్, సిరా పెయింటింగ్స్‌ను వేలం వేయనున్నారు.

డీలర్ తెలిపిన వివరాల ప్రకారం.పెయింటింగ్స్‌లో చిన్న వాటిని 75,000 డాలర్లకు, పెద్ద వాటిని 5,00,000 డాలర్లకు విక్రయించనున్నారు.

అయితే దీనిని తన కుమారుడి విషయంలో బైడెన్ జోక్యం చేసుకున్నట్లుగానే పలువురు వాదిస్తున్నారు.అంతిమంగా జో బైడెన్ నైతికతను కొందరు ప్రశ్నిస్తున్నారు.

హంటర్ తన వ్యాపారం కోసం తండ్రి పేరు, పలుకుబడి, అధికారాన్ని ఉపయోగిస్తున్నారని రిపబ్లికన్లు విమర్శించే అవకాశం లేకపోలేదు.ఇప్పటికే అనేక మంది రిపబ్లికన్ చట్టసభ సభ్యులు హంటర్ బైడెన్ వ్యాపార వ్యవహారాలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

ముఖ్యంగా బైడెన్ ఉపాధ్యక్షుడిగా వున్న కాలంలో ఉక్రెయిన్ గ్యాస్ కంపెనీ బురిస్మా కోసం తండ్రి అధికారాన్ని వాడుకున్నారంటూ ట్రంప్ హయాంలో పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు