22 ఏళ్ల క్రితం భారతీయుడు సహా ఇద్దరిని కాల్చిచంపిన ఘటనలో దోషిగా తేలిన వ్యక్తికి అమెరికాలోని ఓక్లహోమా రాష్ట్రం( Oklahoma ) గురువారం మరణశిక్షను అమలు చేసింది.మెక్‌అలెస్టర్ పట్టణంలోని ఓక్లహోమా స్టేట్ పెనిటెన్షియరిలో మైఖేల్ డెవేన్ స్మిత్ కు( Michael Dewayne Smith ) ప్రాణాంతకమైన ఇంజెక్షన్ ద్వారా మరణశిక్ష విధించబడిందని టెలివిజన్ స్టేషన్ కో కో టీవీ నివేదించింది.2002 ఫిబ్రవరి 22న వేర్వేరు ఘటనల్లో 24 భారతీయ స్టోర్ క్లర్క్ శరత్ పుల్లూరు,( Sharath Pulluru ) 40 ఏళ్ల జానెట్ మూర్‌లను హత్య చేసినందుకు స్మిత్‌కు కోర్టు మరణశిక్ష విధించింది.
ఓక్లహోమా అటార్నీ జనరల్ జెంట్నర్ డ్రమ్మాండ్ . స్మిత్ ఉరితీతపై ఒక ప్రకటన విడుదల చేశారు.ఇవాళ జానెట్ మిల్లర్ మూర్,( Janet Miller-Moore ) శరత్ పుల్లూరు కుటుంబాలకు శాంతి కలుగుతుందన్నారు.22 సంవత్సరాల పాటు వారు అనుభవించిన వేదనపై ఆయన విచారం వ్యక్తం చేశారు.ఉన్నత విద్యను అభ్యసించడానికి చిన్న వయసులోనే శరత్ అమెరికాకు వచ్చాడని జెంట్నర్ అన్నారు.
మంచి భవిష్యత్ వున్న అతను అర్థాంతరంగా దూరమయ్యాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గత నెలలో శరత్ సోదరుడు హరీష్ పుల్లూరు.స్మిత్ క్షమాభిక్షను తిరస్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రకటన విడుదల చేశారు.

శరత్ అద్భుతమైన వ్యక్తని.మా కుటుంబంలో అమెరికాకు వచ్చిన తొలి వ్యక్తి ఆయనేనని హరీష్ గుర్తుచేశారు .తాను డాక్టర్‌ను కావడానికి కారణం ఆయనేనని.శరత్ మొదటిసారి అమెరికాకు వచ్చినప్పుడు , ఆయన ఫోన్ కోసం భారతదేశంలోని ఒక ఫోన్ బూత్‌లో వేచి వుండేవాడినని గుర్తు చేసుకున్నారు.ఆ సమయంలో తాము జరిపిన సంభాషణ మరిచిపోలేనని హరీష్ పేర్కొన్నారు.
మా కుటుంబానికి ఆయనే ప్రాణమని .శరత్ ఆకస్మిక మరణం మా జీవితాలను ప్రతిరోజూ ప్రభావితం చేసిందని, అందుకే నిందితుడికి క్షమాభిక్షను తిరస్కరించాలని తాము కోరుతున్నామని హరీష్ డిమాండ్ చేశారు.

మరోవైపు .మరణశిక్ష అమలుకు ముందు స్మిత్ ఒక ప్రకటనలో ఇలా అన్నారు.తన జీవితం లైన్‌లో వుందని .కొత్త సాక్ష్యం వున్నప్పటికీ తన తరపున తదుపరి అప్పీళ్లను దాఖలు చేయబోనని నా న్యాయవాది మార్క్ హెన్రిక్‌సెన్ తన కుటుంబానికి తెలియజేశారని స్మిత్ చెప్పారు.దానిని డిమాండ్ చేయడానికి తాను ఈ ప్రకటనను విడుదల చేస్తున్నానని.హెన్రిక్‌సన్ తన పని తాను చేసుకుంటూ తన జీవితం కోసం పోరాడుతాడని స్మిత్ ఆ ప్రకటనలో తెలిపాడు.