20 నెలల తర్వాత : విదేశీ ప్రయాణికులపై నిషేధం ఎత్తివేసిన అమెరికా.. ఇవాళ్టీ నుంచి బోర్డర్స్ ఓపెన్ ..!

కరోనా మహమ్మారి కారణంగా గతేడాది అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించారు నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.

ఆ తర్వాత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ సైతం ఈ ఆంక్షలను యథావిధిగా కొనసాగించారు.

అయితే వివిధ దేశాల్లో కరోనా పరిస్థితులు మెరుగుపడినందున కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా దేశాల పౌరులను దేశంలోకి అనుమతించాలని జో బైడెన్ సర్కార్ నిర్ణయించింది.వాక్సినేషన్‌ పూర్తిచేసుకున్న వారిని ఈ రోజు నుంచి అమెరికాలోకి అనుమతిస్తోంది.

ఎఫ్‌డీఏ లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం పొందిన టీకాలను వేసుకున్న వారిని అనుమతించనున్నట్టు అమెరికా ప్రభుత్వం పేర్కొంది.మరోవైపు కోవాగ్జిన్ రెండు టీకాలు వేయించుకున్న ప్రయాణీకులు కూడా నవంబర్ 8 నుంచి తమ దేశంలోకి ప్రవేశించడానికి ఫెడరల్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర వినియోగ జాబితా (ఈయూఎల్)లోకి చేర్చడంతో యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) సైతం దానిని ఆమోదించింది.కాగా.

Advertisement

యూఎస్ కొత్త ప్రయాణ నియమాల ప్రకారం.ఫైజర్ బయోఎన్‌టెక్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా, ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా, కోవిషీల్డ్, సినోఫార్మ్, సినోవాక్‌లను పూర్తిగా తీసుకున్న ప్రయాణీకులను అమెరికాకు అనుమతిస్తోంది.

సోమవారం నుంచి విమానాశ్రయాలు, భూ సరిహద్దుల వద్ద పూర్తిగా టీకాలు వేసుకున్న ప్రయాణీకులను అమెరికా .తమ దేశంలోకి అనుమతిస్తోంది.అమెరికాను ఆనుకోని వుండే కెనడా, మెక్సికో దేశాల వాసులకు మాత్రం వ్యాక్సినేషన్‌ చేయించుకున్నట్లు ధ్రువీకరణచాలని, ఎలాంటి టెస్ట్‌లు అక్కర్లేదని ఫెడరల్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరోవైపు అంతర్జాతీయ ప్రయాణీకులపై ఆంక్షలు ఎత్తివేయడంతో విమానయాన సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.యూరప్, ఇతర ప్రాంతాల నుంచి రద్దీ పెరుగుతుందని భావిస్తున్నాయి.ట్రావెల్ అండ్ అనలిటిక్స్ సంస్థ సిరియమ్ డేటా ప్రకారం.

గత నెలతో పోలిస్తే ఈ నెలలో యూకే- యూఎస్ మధ్య 21 శాతం విమాన సర్వీసులు పెరిగినట్లు తెలిపింది.ఇప్పటికే మెక్సికో నుంచి సరిహద్దులు లేకపోవడంతో యూఎస్ సరిహద్దు పట్టణాల్లో మాల్స్, రెస్టారెంట్లు, మెయిన్ స్ట్రీట్ దుకాణాలు ధ్వంసమయ్యాయి.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!

అంతేకాదు.ఆత్మీయుల సెలవులు, పుట్టినరోజులు, అంత్యక్రియలకు దూరంగా వున్నారు.

Advertisement

తాజా వార్తలు