అమెరికాలో గన్ కల్చర్..తమ్ముడిని కాల్చి చంపిన 3 ఏళ్ళ బాలుడు..!!

అమెరికాలో విచ్చలవిడిగా, ఎదేశ్చగా సాగుతున్న తుపాకులు వాడటంపై నిషేధం విధించాలని ఎన్నో ఏళ్ళుగా నిరసనలు, ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి.

కానీ ఎక్కడా కూడా గన్ కల్చర్ నియంత్రణపై చర్యలు తీసుకున్న ధాఖలాలు కనపడలేదు.

గత ప్రభుత్వ అధ్యక్షులు కానీ ట్రంప్ హయాంలో కానీ గన్ కల్చర్ పై తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పాలి.ఇక బిడెన్ అధ్యక్షుడు అయిన తరువాత గన్ కల్చర్ నియంత్రణపై పెద్దగా స్పందించిన ధఖాలలు కూడా లేవు.

ఈ క్రమంలోనే అమెరికాలో ఈ మధ్య కాలంలో తుపాకుల వాడకం ద్వారా మృతి చెందుతున్న ఘటనలు రోజు రోజుకు పెరిగిపోవడంతో బిడెన్ అలెర్ట్ అయ్యారు.గన్ కల్చర్ పై ఎన్నికల ప్రచారంలో కూడా పెద్దగా ప్రస్తావించని బిడెన్ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా గన్ కల్చర్ నియంత్రణపై ముందడుగు వేశారు.

నిషేధానికి సంభందించిన కీలకమైన మార్గదర్సకాలపై నివేదిక ఇవ్వాలని నిపుణులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ ఆదేశాలు ఇచ్చి రెండు 48 గంటలు కూడా గడవక ముందు అమెరికాలో రెండు సార్లు గన్ ఫైర్ జరిగిన సంఘటనలు నమోదు అయ్యాయి.

Advertisement

అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో జరిగిన గన్ ఫైరింగ్ ఘటన యావత్ అమెరికాను ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాకుండా అమెరికా తుపాకి సంస్కృతికి అద్దం పడుతోంది.టెక్సాస్ రాష్ట్రంలోని హ్యుస్టన్ నగరంలో ఓ ఇంట్లో మూడేళ్ళ బాలుడు ఆడుకుంటున్నాడు.

అతడు ఆడుకుంటున్న క్రమంలో తుపాకి దొరికింది.అది బొమ్మ తుపాకి అనుకున్న బాలుడు తన 8 నెలల తమ్ముడిపై సరదాగా కాల్పులు జరిపాడు.

ఛాతీ లోకి బుల్లెట్లు దిగడంతో అక్కడికక్కడే నెలల పిల్లాడు మృతి చెందాడు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పిల్లాడి చేతికి తుపాకి ఎలా వచ్చింది, సదరు గన్ కి లైసెన్స్ ఉందా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాలు మరోసారి భగ్గుమన్నాయి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

తుపాకులపై నియంత్రణ పెట్టనంత వరకూ ఇలాంటి ఘటనలు మనం అమెరికాలో రోజుకొకటిగా చూస్తూనే ఉండాల్సి వస్తుందని మండిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు