“స్టూడెంట్ వీసా” లపై కీలక సూచనలు చేసిన “అమెరికా ఎంబసీ”

భారత్ లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న క్రమంలో అమెరికా ఎంబసీ జూన్ 14 నుంచీ స్టూడెంట్ వీసాలకు అనుమతులు ఇచ్చి అర్హతలు కలిగిన వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.అయితే దరఖాస్తు దారులైన స్టూడెంట్ కొన్ని విషయాలలో ఆందోళన చెందుతున్న నేపధ్యంలో అమెరికా ఎంబసీ కొన్ని కీలక సూచనలు చేసింది.

అమెరికాలోని యూనివర్సిటీలలో అడ్మిషన్లు పొందిన అందరూ ఒక్క సారిగా వెబ్సైటు లోకి వస్తున్నారని దాంతో వెబ్సైటు క్రాష్ అవుతోందని, అంతేకాకుండా స్టూడెంట్స్ తొందర పాటుగా రిఫ్రెష్ బటన్ నొక్కడం కారణంగా వారి ఎకౌంటు లు బ్లాక్ అవుతున్నాయని, ముందుగానే ఈ విషంలో తాము హెచ్చరించినా విద్యార్ధులు ఎవరూ పట్టించుకోలేదని అన్నారు.అయితే 72 గంటల పాటు ఈ అకౌంట్స్ బ్లాక్ అవుతాయని ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని ఎకౌంటు లు బ్లాక్ అయిన విద్యార్ధులు తమ అకౌంట్స్ ను అన్ లాక్ చేయాలని చేస్తున్న వినతులను పరిశీలించామని విద్యార్ధులు అపాయింట్మెంట్స్ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, జులై నెలలో మళ్ళీ మరిన్ని అపాయింట్మెంట్స్ ఇస్తామని ప్రకటించింది.కేవలం విద్యార్ధుల వినతులను పరిశీలించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నామని బ్లాక్ అయిన అకౌంట్స్ వారు జులై నెల వరకూ వేచి ఉండాలని సూచించింది.

ఇదిలాఉంటే.

అడ్మిషన్లు పొందిన విద్యార్ధులు అందరూ ఐపీఏం లో వ్యాక్సిన్ వేయించుకోవాలని అనుకుంటున్నారని, కానీ విద్యార్ధులు అందరూ ఐపీఏం లో వ్యాక్సిన్ వేయించుకునే కంటే నేరుగా మీ మీ వర్సిటీల సూచనల మేరకు వ్యాక్సిన్ లు వేయించుకోవడం మంచిదని ఎంబసీ తెలిపింది.ఎందుకంటే అమెరికాలో కొన్ని వర్సిటీలు విద్యార్ధులు ముందుగానే వేయించుకున్న వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు చెప్పడం లేదని, కానీ కొన్ని వర్సిటీలు మాత్రం తాము సూచించిన వ్యాక్సిన్ ను మాత్రమే వేయించుకోవాలని తేల్చి చెప్తున్నాయని ఎంబసీ విద్యార్ధులకు సూచించింది.

Advertisement

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

తాజా వార్తలు