విస్కాన్సిన్ గురుద్వారాలో నరమేధానికి పదేళ్లు... బాధితులకు నివాళులర్పించిన అమెరికా అంబాసిడర్

అమెరికాతో పాటు భారత్‌లోనూ తీవ్ర కలకలం రేపిన విస్కాన్సిన్‌లోని సిక్కు గురుద్వారాపై దాడి జరిగి పదేళ్లు గడుస్తున్న నేపథ్యంలో గత వారం అమెరికా ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు క్యాండిల్‌లైట్ స్మారక జాగరణలో పాల్గొన్నారని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ సోమవారం వెల్లడించింది.

అంతర్జాతీయ మత స్వేచ్చపై అమెరికా రాయబారిగా వున్న రషద్ హుస్సేన్ విస్కాన్సిన్‌లోని ఓక్ క్రీక్‌కు వెళ్లినట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

ఫెడరల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, పౌర సమాజం, మత పెద్దలను, 2012 దాడి బాధితులను గౌరవించటానికి, సిక్కు సమాజానికి సంఘీభావంగా నిలబడటానికి ఈ కార్యక్రమం జరిగిందని స్టేట్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.ఆగస్ట్ 5, 6 తేదీలలో విస్కాన్సిన్ పర్యటన సందర్భంగా హుస్సేన్ .కమ్యూనిటీ నాయకులు, స్థానిక ప్రభుత్వాధికారులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ద్వేషాన్ని ఎదుర్కోవడానికి, మత స్వేచ్ఛ, ప్రార్థనా స్థలాలను ప్రతిచోటా రక్షించడానికి కలిసి పనిచేయడానికి ఆయన తన నిరంతర ప్రయత్నాలను చర్చించారు.

ఇకపోతే.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా విస్కాన్సిన్ మృతులకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.దేశీయ ఉగ్రవాదం శ్వేతజాతి దురహంకారం సహా అన్ని రూపాల్లో వున్న ద్వేషాన్ని అంతం చేయడానికి, అమెరికాలో గన్ కల్చర్‌ను, ఆయుధాల వాడకాన్ని నిషేధించాలని బైడెన్ పిలుపునిచ్చారు.

Advertisement
US Ambassador Rashad Hussain Participated In The Candlelight Remembrance 2012 Wi

దురదృష్టవశాత్తూ గడిచిన దశాబ్ధ కాలంగా మనదేశంలోని ప్రార్థనా మందిరాలపై దాడులు సర్వసాధారణమయ్యాయని అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రార్థనలో తల వంచినప్పుడు ఎవరూ తమ ప్రాణాల కోసం భయపడాల్సిన అవసరం లేదని.

అమెరికాలో స్వేచ్ఛగా జీవితాన్ని గడపొచ్చని జో బైడెన్ భరోసా కల్పించారు.

Us Ambassador Rashad Hussain Participated In The Candlelight Remembrance 2012 Wi

ఓక్ క్రీక్ సంఘటన తమకు మార్గాన్ని చూపిందన్న ఆయన.దాడి తర్వాత సిక్కు కమ్యూనిటీ సభ్యులు గురుద్వారాకు తిరిగి వచ్చి సాధారణ పరిస్ధితులు నెలకొల్పాలని బైడెన్ ప్రశంసించారు.సిక్కులు, ఇతర మైనారిటీ సమూహాలపై ద్వేషపూరిత నేరాలను గుర్తించాలని ఫెడరల్ ప్రభుత్వానికి పిలుపునిస్తూ.

బాధితుల్లో ఒకరి కుమారుడు యూఎస్ కాంగ్రెస్ ఎదుట సాక్ష్యం చెప్పాడని అమెరికా అధ్యక్షుడు ప్రశంసించారు.దేశంలో తుపాకీ హింసను తగ్గించడానికి, మన తోటి అమెరికన్లను సురక్షితంగా ఉంచడానికి చర్యలు తీసుకోవాలని జో బైడెన్ పిలుపునిచ్చారు.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

కాగా.ఆగస్టు 5, 2012లో విస్కాన్సిన్ రాష్ట్రంలోని ఓక్ క్రీక్ ప్రాంతంలో ఉన్న సిక్కు ప్రార్థనా మందిరంలో శ్వేతజాతీయుడు ఉన్మాదిలా ప్రవర్తించాడు.

Advertisement

గురుద్వారాలో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో ఏడుగురు సిక్కులు ప్రాణాలు కోల్పోగా.

ముగ్గురు తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే.

తాజా వార్తలు