Urvashi rautela : వరల్డ్ కప్ తో దర్శనమిచ్చిన ఊర్వశి రౌతేలా.. రిషబ్ పంత్ కోసమే అంటూ?

ఊర్వశి రౌతౌలా( Urvashi rautela ).ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో వేర్ ఇస్ ద పార్టీ అంటూ స్టెప్పులను ఇరగదీసిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో ప్రేక్షకులకు బాగా చేరువఅయ్యింది.ఈ పాట విడుదలైన తర్వాత ఒక్కసారిగా భారీగా పాపులారిటీని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

అలాగే ఇటీవలే విడుదలైన అఖిల్ మూవీ ఏజెంట్‌ లో కూడా స్పెషల్ సాంగ్ వైల్ట్ సాలా అంటూ అభిమానులను ఊర్రూతలుగించింది.

అలా ఊర్వశీ ప్రస్తుతం తెలుగు ఐటం సాంగులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో ఈ ముద్దుగుమ్మ తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉంది.ఇకపోతే ఇండియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌లో వన్డే వరల్డ్ కప్( ICC world cup 2023 ) జరగనున్న సంగతి తెలిసిందే.

Advertisement

టోర్నీ ప్రారంభానికి ముందు ట్రీఫీ చాలా దేశాలను చుట్టేసి వస్తోంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఫ్రాన్స్‌లోని ప్రతిష్ఠాత్మక ఈఫిల్ టవర్‌ ముందు ఐసీసీ ప్రపంచ కప్ -2023ను ఆవిష్కరించారు.

అయితే ఈ ట్రోఫీని బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఆవిష్కరించింది.ఈ అరుదైన అవకాశం దక్కించుకున్న తొలి నటిగా ఉర్వశి నిలిచింది.ఇదే విషయాన్ని ఊర్వశి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

వరల్డ్‌ కప్‌ ముందు నిలబడి ఫోటోలకు పోజులిచ్చింది.

అందుకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ షేర్ చేస్తూ ఈ అవకాశమిచ్చిన ఐసీసీకి కృతజ్ఞతలు తెలిపింది.ఇది చూసిన అభిమానులు ఊర్వశిపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?

ఆ ఫోటోలపై నెట్టిజెన్స్ కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.ఒక నెటిజన్ ఊర్వశి రౌతేలా వరల్డ్ కప్ పట్టుకుందంటే.ఇక నెక్స్ట్ రిషబ్( Rishabh Pant ) భయ్యా వంతు అంటూ పోస్ట్ చేశాడు.

Advertisement

ఇప్పుడు గెలవాల్సింది ఒకటి కాదు, రెండు ట్రోఫీలు అంటూ ఫన్నీగా రాసుకొచ్చాడు.

తాజా వార్తలు