ఏంటి.. ఆ మెగా యంగ్ హీరో కి బట్ట తల ఉందా....?

తెలుగులో నూతన దర్శకుడు బుచ్చి బాబు సాన దర్శకత్వం వహించిన "ఉప్పెన" అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన "మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్" గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 వచ్చీ రావడంతోనే వైష్ణవ్ తేజ్ ఉప్పెన చిత్రంతో 50 కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించి పలు రికార్డులను నెలకొల్పాడు.

దీంతో ఈ కుర్రహీరోకి ప్రస్తుతం సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.అయితే తాజాగా వైష్ణవ్ తేజ్ కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

 అయితే అంతగా ఆ వీడియోలో ఏముందంటే వైష్ణవ్ తేజ్ సీసాతో మ్యాజిక్ చేశాడు. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది.

 కానీ ఈ వీడియోలో వైష్ణవ్ తేజ్ కొంతమేర గుండు చేయించుకుని బట్ట తలతో కనిపిస్తున్నాడు.ఈ వీడియో ఎప్పుడో నాలుగేళ్ల క్రితం తీసినప్పటికీ  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

దీంతో కొందరు మీమ్ క్రియేటర్స్ ఈ వీడియోని  సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

 ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తయ్యాయి.దీంతో తాజాగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలో కూడా హీరోగా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు