అయ్య బాబోయ్: మాస్క్ ధరించలేదని బ్యాంక్ కి వచ్చిన కస్టమర్ ని గన్ తో కాల్చిన సెక్యూరిటీ గార్డ్..!

మాస్క్ విషయమై జరిగిన చిన్న గొడవ చివరికి ఒకరిపై కాల్పులకు కారణం అయింది.

ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని ఓ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లో చోటు చేసుకుంది.

రైల్వే ఉద్యోగి కారులో మాస్క్ మర్చిపోయి బ్యాంకుకు వచ్చిన వ్యక్తిని అక్కడి గార్డు అడ్డుకున్నాడు.దాంతో ఆ వ్యక్తి వెనుతిరిగి వెళ్లి మాస్క్ పెట్టుకుని బ్యాంక్ దగ్గరికి వచ్చారు.

అయితే, ఈసారి భోజనం సమయం లోపలి వెళ్లనిచ్చేది లేదని మళ్ళీ అడ్డుపడ్డాడు సెక్యూరిటీ గార్డు.దీంతో ఆ కస్టమర్ సెక్యూరిటీ గార్డుతో వాగ్వివాదం మొదలు పెట్టుకున్నారు.

అయితే వారి వాదన మధ్యలో కోపం వచ్చిన గార్డు అతని కాలిపై తుపాకీతో కాల్పులు చేశాడు.దీంతో ఆ కస్టమర్ అక్కడికక్కడే కుప్పకూలాడు.

Advertisement

ఆ తర్వాత బాధితుడి భార్య ప్రియాంకకు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన వివరాలు ఇలా.ఉత్తరప్రదేశ్ లోని బరేలీ కి చెందిన రాజేష్ రైల్వే ఉద్యోగి.స్టేషన్ రోడ్డు లోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో తన పాస్ బుక్ ఎంట్రీల కోసం శుక్రవారం బ్యాంక్ కు వచ్చారు.

కారులో వచ్చిన ఆ రైల్వే ఉద్యోగి కారు దిగి బ్యాంక్ కు వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించడం మర్చిపోయారు.ఆ సమయంలో బ్యాంక్ గేటు వద్ద సెక్యూరిటీ గార్డు కేశవ్ ప్రసాద్ మిశ్రా మాస్క్ లేకుండా లోపలి రానివ్వరని చెప్పాడు.

దాంతో ఆయన వెనుతిరిగి కారు వద్దకు వెళ్లి మాస్క్ పెట్టుకుని తిరిగి వచ్చారు.

అయితే, ఈసారి సెక్యూరిటీ గార్డ్ భోజనాల టైం అయిందనీ.కాసేపు ఉండి రావాలనీ ఆపివేశాడు.దీంతో రైల్వే ఉద్యోగి రాజేష్ తనకి ఎక్కువ పనిలేదని.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

కేవలం పాస్ బుక్ ఎంట్రీ అని తెలిపాడు.అయినా సరే సెక్యూరిటీగార్డ్ ప్రసాద్ వినలేదు.

Advertisement

దీంతో వారు వాదనకు దిగారు.అయితే, ప్రసాద్ కాస్త గట్టిగానే మాట్లాడి రాజేష్ ను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పాడు.

అయినా కానీ రాజేష్ వినలేదు.దీంతో కోపం పట్టలేని సెక్యూరిటీ గార్డ్ కేశవ్ ప్రసాద్ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చాడు.

ఈ సంఘటనతో రాజేష్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

ఆ సమయంలో రక్తపు మడుగులో కింద పడిపోయి ఉన్న రాజేష్ ను రక్షించడానికి బ్యాంకు సిబ్బంది ఎవరూ రాలేదు.కనీసం అతని కొరకు అంబులెన్స్ కూడా పిలిచే ప్రయత్నం చేయలేదు.దాంతో రాజేష్ విషయాన్ని కాస్త తన భార్య ప్రియాంకకు ఫోన్ చేసి చెప్పగా.

ఆమె రాజేష్ సహా ఉద్యోగులకు సమాచారం ఇవ్వగా వారు పరుగున బ్యాంక్ వద్దకు చేరుకున్నారు.దాంతో అందరూ కలసి రాజేష్ ను ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తుండగా.

పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

తాజా వార్తలు