నాడు స్టార్ కిడ్, లక్సరీ స్టేటస్ కానీ నేడు టెర్రరిస్టులు, హంతకుల పక్కన చిప్ప కూడు

పుత్రుడు జన్మించినప్పుడు కాదు.ఆ పుత్రుడిని నలుగురు పొగిడినప్పుడు ఏ తల్లిదండ్రికైనా సంతోషం కలుగుతుంది.

సమాజం తన బిడ్డ గురించి మంచిగా మాట్లాడుకున్నప్పుడే పుత్రోత్సాహం కలుగుతుంది.కానీ కొంత మంది బలిసిన కొడుకులు చేసే పని తల్లిదండ్రులకు ఎనలేని అపకీర్తి తీసుకొస్తుంది.

వాస్తవం మాట్లాడుకుంటే.డబ్బుంది.

గౌరవం ఉంది.ఏం చేసినా చెల్లుతుంది అని పలువురు ధనవంతులు, సెలబ్రిటీలు ఫీలవుతుంటారు.

Advertisement

ఇంకా చెప్పాలంటే తమ పిల్లలు చెడిపోవడానికి తల్లిదండ్రులే కారణం అవుతారు.సేమ్ ఇలాంటి తప్పే చేశాడు.

బాలీవుడ్ టాప్ స్టార్ షారుఖ్ ఖాన్.తన కొడుకు చెడ్డవాడిగా లేకపోతే తాను.సంతోషంగా ఉండలేనని చెప్తాడు.

ఆయన సరదాకు చెప్పాడో.ఏ ఉద్దేశంతో చెప్పాడో తెలియదు.

కానీ.ఇప్పుడు డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

విలాస జీవితాన్ని వదిలి జైలు జీవితంలో చిప్పకూడు తింటున్నాడు షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్.తన తండ్రి మాటలు నిజం చేయాలి అనుకున్న ఆర్యన్.

Advertisement

చిన్న తనంలోనే అడ్డదారులు తొక్కాడు.అడిగినంత డబ్బు.

లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్న ఈ కుర్రాడు.పార్టీలు, పబ్బులు, డ్రగ్స్, అమ్మాయిలు అంటూ వెళ్లాడు.చివరకు పార్టీలో ప్రమాదకరమైన మాదకద్రవ్యాలు తీసుకుంటూ పట్టుబడ్డాడు.

సముద్రంలో షిప్ మీద పార్టీ చేస్తూ డ్రగ్స్ తీసుకుంటుండగా.నార్కోటిక్స్ అధికారులు పట్టుకున్నారు.

అనంతరం తనను కోర్డుకు తీసుకెళ్లడంతో రిమాండ్ విధించింది.అటు బెయిల్ కు అప్లై చేసుకున్నా మంజూరు చేయలేదు.

ప్రస్తుతం అత్యంత నేరస్తులను ఉండే ముంబై ఆర్థర్ రోడ్డులోని సెంట్రల్ జైల్లో పడేశారు.విలాస జీవితాన్ని గడిపిన ఆర్యన్ చిప్పకూడు తింటున్నాడు.

ఆర్థర్ రోడ్డు జైలు అంటేనే అత్యంత కిరాతకులు ఉండే జైలుగా పేరుంది.మాఫియా డాన్లు, కరుడుగట్టిన ఉగ్రవాదులు ఇందులో ఉంటున్నారు.గతంలోనూ దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన కేసుల్లో నిందితులుగా ఉన్న కిరాతకులు సైతం ఈ జైల్లోనే గడిపారు.

ఇలాంటి క్రూర నేరస్తులు ఉండే జైల్లో ప్రస్తుతం షారుఖ్ ఖాన్ కొడుకుతో పాటు అతడి స్నేహితులు ఊచలు లెక్కపెడుతున్నారు.తప్పుడు పనులు చేస్తే ఎంతటి వారైనా జైల్లో మగ్గాల్సిందే అనే నిజం ఆర్యన్ విషయంలో నిజం అయ్యింది.

తాజా వార్తలు