చిన్న శాస్త్రి.. కళాతపస్విగా ఎదిగేందుకు ఉపయోగపడిన సినిమా ఏంటో తెలుసా?

కలిసొచ్చిన అదృష్టం.ఎన్టీఆర్ హీరోగా 1968లో వచ్చిన సినిమా.

అద్భుత విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా సీనియర్ నటి శాంత కుమారిని బుక్ చేశాడు నిర్మాత మిద్దె జగన్నాథం.

మీకు కథ చెప్పడానికి దర్శకుడిని ఇంటికి ఎప్పుడు పంపించమంటారు? అని శాంత కుమారికి ఫోన్ చేశాడు నిర్మాత.డైరెక్టర్ మా ఇంటికి రావడమేంటి? నేనే మీ ఆఫీసుకు వస్తాను.అక్కడే కథ వింటాను అని చెప్పింది తను.కంపెనీ కారులో ఆఫీసుకు వెళ్లింది తను.అక్కడ చిన్న శాస్త్రి అనే యువకుడు రండమ్మా అని స్వాగతం పలికాడు.ఈ చిన్న శాస్త్రి గతంలో వాహినీ స్టూడియోలో సౌండ్ ఇంజినీర్ గా ఎప్పుడూ ఖాకీ యూనిఫాంలో కనిపించేవాడు.

ఇప్పుడు కూడా అవే దుస్తుల్లో కనిపించాడు.నువ్విక్కడున్నావ్ ఏంటి చిన్న శాస్త్రీ అని అడిగింది శాంత కుమారి.

Advertisement

ఈ సినిమాకు నేనే డైరెక్టర్ ను అని చెప్పాడు చిన్న శాస్త్రి.నీ ఇల్లు బంగారం కానూ.

నువ్వెప్పుడు డైరెక్టర్ వి అయ్యావు నాయానా? అని ఆశ్చర్యపోయింది హీరోయిన్.ఆ చిన్న శాస్త్రి మరెవరో కాదు దర్శకుడు, కళాతపస్వి కె విశ్వానాథ్.

ఆఫీసులోకి వెళ్లిన శాంత కుమారికి దర్శకుడు కథ చెప్పాడు.ఈ కథలో తన పాత్ర కాస్త చిత్ర విచిత్రంగా ఉన్నట్లు అనిపించింది తనకి.నేనెప్పుడూ ఏవేవో ఏడ్చే పాత్రలు మాత్రమే చేశాను.

కానీ వచ్చీ రాని ఇంగ్లీష్ లో మాట్లాడే కామెడీ పాత్రలు చేయగలనా? అని విశ్వనాథ్ తో అన్నది తను.మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారు? రామారావు గారు కూడా ఈ పాత్రకు మీరే కరెక్ట్ అని చెప్పారు అన్నాడు చిన్న శాస్త్రి.ఆ కామెడీ పాత్రలో తనను ఎలా రిసీవ్ చేసుకుంటారో? అని భయపడింది.శాంత కుమారి.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

కానీ కలిసొచ్చిన అదృష్టం అనే సినిమా అద్భుతంగా వచ్చింది.ఈ సినిమా విడుదల అయ్యాక జనాల నుంచి మంచి స్పందన వచ్చింది.

Advertisement

ఈ సినిమాను చూసేందుకు జనాలు థియేటర్లకు ఎగబడ్డారు.ఆ తర్వాత 1971లో చిన్న నాటి స్నేహితులు అనే సినిమాలో కూడా విశ్వనాథ్ తనతో మరో పాత్ర వేయించాడు.

ఈ పాత్ర కూడా సినిమా విజయంలో మంచి పాత్ర పోషించింది.ఆమెకు కూడా మంచి పేరు తీసుకువచ్చింది.

తాజా వార్తలు