ఆ వయసులోనే అందాల పోటీలో గెలిచిన సుమలత

సుమలత.తెలుగు సినిమా పరిశ్రమతో పాటు దక్షిణాది సినిమా రంగాన్ని ఏలిన నటీమణి.

నేచురల్ నటనతో పాటు నేచురల్ బ్యూటీ సుమలత.హిందీలోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

సుమలత సొంతూరు గుంటూరు.తల్లిదండ్రులు చెన్నైకి వెళ్లారు.

అక్కడే ఆమె జన్మించింది.మూడేళ్ల వయసులో తన తండ్రి ముంబైకి ట్రాన్స్ ఫర్ అయ్యాడు.

Advertisement

అక్కడికి వెళ్లారు.కొద్ది రోజుల తర్వాత తండ్రి అకస్మాత్తుగా చనిపోయాడు.

దీంతో తన తల్లితో కలిసి గుంటూరుకు వచ్చింది.స్థాని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ లో చదువుకుంది.

అప్పుడే తను ఓ అరుదైన గుర్తింపు తెచ్చుకుంది.ఇంతకీ ఆ గుర్తింపు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సుమలత పదో తరగతి చదువుతున్న సమయంలో అందాల పోటీలు జరిగాయి.తమ స్కూల్ నుంచి సుమలతను పంపిచాలి అనుకున్నారు టీచర్లు.అందుకోసం తన తల్లిని ఒప్పించి పంచారు.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

నిజానికి సుమలతకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు.అయినా టీచర్ల కోరిక మేరకు అందులో పాల్గొంది.

Advertisement

ఈ పోటీ కొసం తను తొలిసారి చీర కట్టుకుంది.జడ్జీలు ఆమెను స్టేజి మీద అటు ఇటు నడవమన్నారు.అటు ఇటు నడించింది.

తర్వాత వెళ్లిపోవచ్చు అనుకుంది.ఇంతలోగా జడ్జీలు ఓ ప్రకటన చేశారు.

ఈ పోటీల్లో సుమలత విజయం సాధించినట్లు చెప్పారు.ఆమె ఆశ్చర్యపోయింది.

అటు ఈ కార్యక్రమానికి జమున ముఖ్య అతిధిగా వచ్చింది.తన చేతుల మీదుకు సుమలతకు కిరటం పెట్టింది.నీకు మంచి భవిష్యత్ ఉంది.

సినిమాల్లోకి రావాలి అని చెప్పింది.అప్పటి వరకు తనుకు సినిమాల్లోకి రావాలి అనే ఆలోచనలేదు.

జమున ఆశీర్వాదం మూలంగా తనకు సినిమాల్లోకి రావాలనే కోరిక కలిగింది.ఆ తర్వాత కొద్ది రోజులకే తనకు సినిమాల్లో ఆఫర్ వచ్చింది.

నిజానికి ఈ అందాల పోటీల కార్యక్రమాన్ని కొన్ని మేగజైన్స్ కవర్ పేజీపై ఫోటోలు ముద్రించాయి.

ఈ ఫోటోలను రామానాయుడు చూశాడు.దీంతో ఆమెకు అవకాశాలు ఇచ్చాడు.చెన్నైకి వెళ్లి తొలి సినిమాకు సైన్ చేసింది సుమలత.

ఆమెకు అడ్వాన్స్ గా వెయ్యి రూపాయలు ఇచ్చాడు.ఆమెతో రెండేళ్ల తర్వాత సినిమా తీశాడు.

ఈలోగా ఆమెకు పలు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.అగ్రతారగా ఎదిగింది.

తాజా వార్తలు