నిరుద్యోగ యువతకు ప్రభుత్వం నుండి త్వరలోనే తీపి కబురు అందుతుంది శ్రీనివాస్ గౌడ్..

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం నుండి త్వరలోనే తీపి కబురు అందనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

స్వామి వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ యూత్ హాస్టల్లో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం హాస్టల్ విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి మొక్కలు నాటి హరితహారం కార్యక్రమం చేశారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ స్వామి వివేకానంద దేశానికి చేసిన సేవలు ఎంతో గొప్పవని అన్నారు.

నేటి యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ధైర్య సహసాలతో ఆయన చూపిన మార్గంలో నడిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా యువత కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు.  రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు లక్షా 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని త్వరలోనే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత కోసం ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.317 జీవో ప్రకారం ఇప్పటికే జోనల్ వ్యవస్థ పూర్తిచేసి ఉద్యోగాల విభజన ప్రక్రియ చేపట్టామని, అంశంపై రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కూడా పూర్తయిందని అన్నారు.ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిపారు.

ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..? 
Advertisement
" autoplay>

తాజా వార్తలు