కోవిడ్ లోన్ దుర్వినియోగానికి పాల్పడిన ఎన్నారైకి జైలు శిక్ష!

చాలామంది భారతీయులు ఇతర దేశాలకు వెళ్లి నిజాయితీగా సంపాదిస్తూ కోటీశ్వరులు అవుతున్నారు.మరికొందరు మాత్రం పక్కదారులు పడుతూ దేశానికి తల వంపులు తెస్తున్నారు.

తాజాగా ఒక వ్యాపారి యూకే ప్రభుత్వాన్ని మోసం చేశాడు.కానీ చివరికి అతడి మోసం బయటపడింది.

దాంతో కటకటాల పాలయ్యాడు.వివరాల్లోకి వెళ్తే.

ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్త కుల్విందర్ సింగ్ సిద్ధూ కోవిడ్ -19 లాక్‌డౌన్ ఉపశమనం కోసం ఉద్దేశించిన ప్రభుత్వ రుణ పథకాన్ని దుర్వినియోగం చేశాడు.దాంతో అతడికి 12 నెలల జైలు శిక్ష విధించడం జరిగింది.

Advertisement

యూకేకి చెందిన బౌన్స్ బ్యాక్ లోన్ స్కీమ్ కరోనా వల్ల ప్రభావితమైన కంపెనీలకు £50,000 వరకు వడ్డీ-రహిత రుణాలను అందించింది.వావిలేన్ లిమిటెడ్ అనే హమాలీ కంపెనీ డైరెక్టర్ సిద్ధూ వెంటనే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని రుణం పొందాడు.ఆ తర్వాత కంపెనీని మూసేసి, తన వ్యక్తిగత ఖాతాకు నిధులను బదిలీ చేసుకున్నాడు.

ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో అతడు దోషిగా కోర్టు ముందు నిల్చవలసిన పరిస్థితి వచ్చింది.

అతను యూకే కంపెనీల చట్టం, మోసం చట్టాన్ని ఉల్లంఘించానని చేసిన నేరాన్ని అంగీకరించాడు.రుణ దరఖాస్తులో కంపెనీ టర్నోవర్‌ను ఎక్కువ చేసి చూపినట్లు కూడా తేలింది.సిద్ధూ జైలుశిక్షతో పాటు £50,000 జప్తు ఆర్డర్‌ను చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

అలాగే కోర్టు ఆదేశాల ప్రకారం అతడు ఆరేళ్లపాటు కంపెనీ డైరెక్టర్‌గా ఉండేందుకు అనర్హుడయ్యాడు.యూకే ఇన్‌సాల్వెన్సీ సర్వీస్, ఇతర డైరెక్టర్లు తమకు అర్హత లేని ప్రజాధనాన్ని తమ వద్ద ఉంచుకోవడానికి తమ వ్యాపారాన్ని రద్దు చేస్తే ఇలాంటి శిక్షను ఎదుర్కోవలసి ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు