ఖైదీలను ఇంటి సభ్యులుగా లేదా అతిథులుగా ట్రీట్ చేసే జైలు ఎక్కడైనా ఉంటుందా అంటే ఉండదని చెప్పవచ్చు.ఎందుకంటే తప్పుచేసిన వారికి తగిన శిక్ష విధించేలా జైళ్లు ఒక నరక కూపంలా ఉంటాయి.
కానీ యూకేలో మాత్రం అలా కాదు.ఇటీవల ఏర్పాటు చేసిన ఒక యూకే జైల్లోని సెల్‌లో బార్‌లకు బదులుగా అందమైన కిటికీలు ఉంటాయి.
ఇక్కడ ప్రతి ఒక్కరూ కుక్కలతో పెట్ థెరపీ సెషన్‌లలో పాల్గొనవచ్చు.ఇలాంటి ‘మెగా జైలు’ ప్రపంచంలో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
నార్తాంప్టన్‌షైర్‌లో ఉన్న ఈ జైలును HMP ఫైవ్ వెల్స్ అని పిలుస్తారు.యూకేలోని నాలుగు పర్యావరణ అనుకూల జైళ్లలో ఇది కూడా ఒకటి.
నివేదికల ప్రకారం, కిటికీలతో కూడిన ప్రిజన్ సేల్స్ హాస్టల్ గదుల వలె కనిపిస్తాయి.ఈ సెల్‌ల నుంచి ఇనుప కడ్డీలు లేదా బార్‌లను తీసివేశారు అధికారులు.
ఇలా కటకటాలు తీసేసిన మొట్టమొదటి ఖైదీల యూనిట్ ఇది.HMP ఫైవ్ వెల్స్‌లో మొదటి ఖైదీ గత నెలలోనే వచ్చాడు.ఇప్పుడు ఇందులో 137 ఖైదీలు సకల సౌకర్యాలు అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
జైలు సిబ్బంది ఈ ఖైదీలందరికీ జైలు నుంచి బయట జీవితానికి అనుకూలంగా మారేలా చేస్తారు.వారిలోని క్రూరత్వ మనసుని పోగొట్టి మంచి ప్రవర్తనను డెవలప్ అయ్యేలా కృషి చేస్తారు.ఏ మాత్రం కఠినంగా వ్యవహరించకుండా మంచితనంతోనే వారిని మార్చాలని జైలు సిబ్బంది చేసే ఆలోచన చాలా గొప్పదని చెప్పొచ్చు.
అంతేకాదు ఈ జైలులో 24 వర్క్‌షాప్‌లతో విభిన్న వినోద కార్యక్రమాలను అందిస్తారు.కుటుంబాలతో ఉన్న ఖైదీలను తమ పిల్లలకు హోమ్‌వర్క్ లో సహాయం చేయడానికి అనుమతిస్తారు.ఇక్కడ ఖైదీల పిల్లల కోసం ప్లేగ్రౌండ్ కూడా ఉంటుంది.ఇందులోని ఖైదీలు వీడియో కాల్‌లు చేసుకోవచ్చు.
ఈ జైలులో 1,700 మంది ఖైదీలు, 700 మంది సిబ్బంది ఉండేంత ప్లేస్ ఉంది.అయితే ఇలాంటి జైలు గురించి తెలుసుకొని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
అన్ని ప్రదేశాల్లో జైళ్లు ఇలాగే ఉంటే నేరగాళ్లకు పండగే అని కామెంట్ చేస్తున్నారు.