యూకేలో 13 నెలల కనిష్టానికి దిగొచ్చిన ద్రవ్యోల్బణం.. రిషి సునాక్‌కి ఊరటేనా..?

బ్రెగ్జిట్, కరోనా, ఆర్ధిక మాంద్యంతో పాటు దేశంలో రాజకీయ సంక్షోభాల కారణంగా ఇంగ్లీష్ గడ్డ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.

బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్‌లు సైతం పరిస్ధితిని చక్కదిద్దలేక పదవుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

ఇలాంటి కఠినమైన పరిస్ధితుల్లో బ్రిటీష్ ప్రధానిగా పగ్గాలు అందుకున్నారు రిషి సునాక్.తద్వారా బ్రిటీష్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా ఆయన రికార్డుల్లోకెక్కారు.

అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆయన పదవి కూడా మూణ్నాళ్ల ముచ్చటేనా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది.కానీ ప్రజలు , పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు సాగుతున్నారు రిషి సునాక్.

ఈ నేపథ్యంలో రిషి సునాక్‌కు( Rishi Sunak ) ఊరట కలిగిలా.బ్రిటన్ వార్షిక ద్రవ్యోల్బణం రేటు ఏప్రిల్‌లో 13 నెలల కనిష్ట స్థాయి (8.7 శాతానికి) పడిపోయింది.అలాగే ఇంధన ధరలు కూడా గత ఏడాదితో పోలిస్తే చాలా తక్కువగా నమోదయ్యాయని బుధవారం అధికారిక డేటా పేర్కొంది.ధరల పెరుగుదల రేటు మార్చిలో 10.1 శాతం నుంచి మందగిస్తూ వచ్చింది.గతేడాది ఆగస్ట్ తర్వాత తొలిసారిగా ద్రవ్యోల్బణం 10 శాతానికి దిగివచ్చినట్లు ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ ఒక ప్రకటనలో తెలిపింది.ప్రస్తుతం ద్రవ్యోల్బణం 8.7 శాతం వద్ద వుండగా.గతేడాది మార్చిలో 7.0గా వుంది.

Advertisement

ఏది ఏమైనప్పటికీ.ధరలు గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువగానే వున్నాయని విశ్లేషకులు అంటున్నారు.వార్షిక ఆహార ధరల ద్రవ్యోల్భణం చారిత్రాత్మక గరిష్ట స్థాయికి సమీపంలో వుందని ఓఎన్ఎస్ చీఫ్ ఎకనామిస్ట్ గ్రాంట్ ఫిట్జ్నర్ ( ONS Chief Economist Grant Fitzner )పేర్కొన్నారు.

ఏప్రిల్‌లో బ్రిటన్ వార్షిక ద్రవ్యోల్భణం రేటు మాదిరే సంపన్న ఆర్ధిక వ్యవస్థలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికాలలోనూ ఎక్కువగా వుంది.అయితే యూకే ప్రభుత్వం ఈ ఏడాది చివరి నాటికి ద్రవ్యోల్బణం 5.0 శాతానికి తగ్గుతుందని పేర్కొంది.

గతేడాదిలో పెరిగిన ఇంధన ధరల పెరుగుదల పునరావృతం కాకపోవడంతో .గత నెలలో ద్రవ్యోల్భణం రేటు గణనీయంగా పడిపోయిందని ఫిట్జ్నర్ తెలిపారు.అయితే సెకండ్ హ్యాండ్ కార్లు, సిగరేట్ ధరలు మాత్రం పెరిగాయన్నారు.అయితే 2023లో బ్రిటన్ ఆర్ధిక వ్యవస్థ 0.4 శాతం విస్తరిస్తుందని ఐఎంఎఫ్ తన తాజా ఔట్‌లుక్ డాక్యుమెంట్‌లో పేర్కొంది.అలాగే బలహీనమైన ఇంధన ధరలను కూడా ఉదహరించింది.

ద్రవ్యోల్బణం, ఐఎంఎఫ్ నివేదిక, ఆర్ధిక పరిస్ధితులపై బ్రిటన్ ఆర్ధిక మంత్రి జెరెమీ హంట్ ( British Finance Minister Jeremy Hunt )స్పందించారు.ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి తాము నిర్ణయాత్మకంగా వ్యవహరించామని ఐఎంఎఫ్ తెలిపిందని ఆయన చెప్పారు.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

ద్రవ్యోల్బణాన్ని తాము సింగిల్ డిజిట్‌లో వుంచినప్పటికీ.ఆహార ధరలు మాత్రం ఇప్పటికీ వేగంగా పెరుగుతున్నాయని జెరెమీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు