కృష్ణ( Krishna )సోదరుడు ఆది శేషగిరిరావు( Adi seshagiri rao ) ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించారు.కృష్ణగారి చివరి రోజుల్లో గంటసేపు నాతో మాట్లాడారని ఆయన తెలిపారు.
అప్పటి విషయాల నుంచి ఇప్పటి విషయాల వరకు, సినిమాల గురించి ఆయన చర్చించారని ఆదిశేషగిరిరావు వెల్లడించారు.బీజేపీ, వైసీపీ( BJP, YCP ) మళ్లీ పవర్ లోకి రావని కృష్ణచెప్పారని ఆయన తెలిపారు.
ఒంటెద్దు పోకడతో ఈ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని కృష్ణ చెప్పారని ఆది శేషగిరిరావు అన్నారు.తెలంగాణలో కేసీఆర్ మరో మారు అధికారంలోకి వస్తారని చెప్పారని ఆయన పేర్కొన్నారు.
ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అభివృద్ధి పనులు ఎక్కువగా జరగడం లేదని ఆది శేషగిరిరావు అన్నారు.రమేష్ బాబు( Ramesh babu ) నటించిన సినిమాలలో చాలా హిట్లు ఉన్నాయని ఆయన కామెంట్లు చేశారు.

ఎన్నో హిట్లు ఉన్నా కెరీర్ పరంగా బాలయ్య, వెంకటేశ్ స్థాయికి ఎదగకపోవడం రమేష్ బాబుకు బాధ పెట్టిందని ఆది శేషగిరిరావు చెప్పుకొచ్చారు.కార్డియాక్ అరెస్ట్ వల్ల రమేష్ బాబు మృతి చెందాడని ఆయన కామెంట్లు చేశారు.అంతకు ముందే గుండెకు సంబంధించిన సమస్యలు ఉంటే స్టంట్స్ వేశారని ఆది శేషగిరిరావు అన్నారు.సౌత్ లో సినీ కుటుంబాల నుంచి ఆడవాళ్లు వస్తే ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత ఉండేదని అందుకే మంజులకు ఇబ్బందులు వచ్చాయని ఆయన తెలిపారు.

రమేష్ బాబు కొడుకుకు సినిమాలపై ఆసక్తి ఉందని ఆది శేషగిరిరావు అన్నారు.నాకు ఒక్కడే కొడుకు అని నా కొడుకు కన్ స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నాడని ఆయన తెలిపారు.విజయవాడ దగ్గర జగన్ ఉంటున్న ఇల్లు, ఆఫీస్ మా బాబు కట్టించినవే అని ఆయన కామెంట్లు చేశారు.ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలు నా కొడుకు ఫ్రెండ్స్ అని వాళ్ల ఇబ్బందులు చూడలేక నా కొడుకు సినిమా ఇండస్ట్రీలోకి రాలేదని ఆయన చెప్పుకొచ్చారు.







