Uday Kiran : ఉదయ్ కిరణ్ కు చిరంజీవే గాడ్ ఫాదర్.. ఉదయ్ కిరణ్ సోదరి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ దివంగత హీరో ఉదయ్ కిరణ్( Hero Uday Kiran ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఒకప్పుడు ఎక్కువగా లవ్ సినిమాలు చేసి అతి తక్కువ సమయంలోనే హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు ఉదయ్ కిరణ్.

అతి తక్కువ సమయంలోనే లవర్ పైగా గుర్తింపు తెచ్చుకున్నారు.కానీ అనుకోకుండా కొన్ని కారణాల వల్ల ఆత్మహత్య చేసుకొని అభిమానులకు, కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చారు.

అయితే ఉదయ్ కిరణ్ మరణించినప్పుడు అప్పటికే అతను వరుస ఫ్లాప్స్ లో ఉండటంతో సినిమాల ఫలితాల వల్ల, ఛాన్సులు రావట్లేదని, ఫైనాన్సియల్ ఇబ్బందుల వల్ల, భార్యతో విభేదాల వల్లే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య( Uday Kiran Suicide ) చేసుకున్నాడని వార్తలు వచ్చాయి.

అయితే చిరంజీవి పెద్ద కూతురుతో ఉదయ్ కిరణ్ నిశ్చితార్థం జరిగింది.కానీ ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయింది.దీంతో చిరంజీవి కావాలని ఉదయ్ కిరణ్ ని తొక్కేసాడని, సినిమా ఛాన్సులు( Movie Offers ) రాకుండా చేసాడని పలువురు వ్యాఖ్యానించారు, విమర్శలు చేసారు.

Advertisement

ఇప్పటికి కొంతమంది చిరంజీవి అంటే గిట్టని వాళ్ళు ఇదే విషయం గురించి మాట్లాడతారు.ఇది ఇలా ఉంటే ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన నువ్వు నేను సినిమా రీ రిలీజ్( Nuvvu Nenu Re Release ) అవ్వడంతో ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.

గతంలో కూడా చిరంజీవి, ఉదయ్ కిరణ్ ఇష్యూ గురించి మాట్లాడిన ఈవిడ తాజాగా మరోసారి ఈ ఇష్యూ మీద మాట్లాడింది.

కాగా ఒక ఇంటర్వ్యూలో ఈ ఇష్యూ గురించి అడగడంతో ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి( Uday Kiran Sister Sridevi ) మాట్లాడుతూ.చిన్నప్పటి నుంచి ఉదయ్ కిరణ్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్.చిన్నప్పుడు ఒక ఈవెంట్లో ఆయన్ని కలిస్తే చాలా ఎగ్జైట్ అయ్యాడు.

సినిమాల్లోకి వచ్చాక చిరంజీవి ఉదయ్ కి సపోర్ట్ చేసారు.ఉదయ్ కిరణ్ కి చిరంజీవి( Chiranjeevi ) గాడ్ ఫాదర్ లాగా ఉండేవారు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

సినిమాల గురించి కూడా ఉదయ్ చిరంజీవితో చర్చించేవారు.ఉదయ్ ఇప్పుడు లేడు.

Advertisement

జరిగిందేదో జరిగింది.దానికి నేనెవర్ని తప్పుపట్టను.

వాటి గురించి ఉదయ్ లేకపోయినా మాట్లాడటం బాధగా ఉంటుంది.కానీ చిరంజీవి గారు ఉదయ్ కి చాలా సపోర్ట్ ఇచ్చారు అని తెలిపింది.

దీంతో ఉదయ్ కిరణ్ సోదరి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

తాజా వార్తలు