యూఏఈలోని రహదారికి భారత సంతతి వైద్యుడి పేరు.. ఎవరీ డాక్టర్ జార్జ్ మాథ్యూ ..!!

యూఏఈ ప్రభుత్వం భారత సంతతికి చెందిన ఓ వైద్యుడికి అరుదైన గౌరవం కల్పించింది.

దేశ ఆరోగ్య రంగానికి చేసిన సేవలకు గాను అబుదాబీలోని( Abu Dhabi ) ఓ రహదారికి ఆయన పేరు పెట్టింది.

దేశాభివృద్దికి దోహదపడిన వ్యక్తులను గౌరవించే లక్ష్యంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ మున్సిపాలిటీస్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ (డీఎంటీ) ‘‘ఆనరింగ్ యూఏఈస్ విజనరీస్ : కామ్మోమెరేటివ్ స్ట్రీట్స్ ’’ ప్రాజెక్ట్‌లో భాగంగా 84 ఏళ్ల డాక్టర్ జార్జ్ మాథ్యూ( Dr George Matthew ) సేవలను గుర్తించింది.అబుదాబీలోని అల్ మఫ్రాక్‌లోని షేక్ షక్బూత్ మెడికల్ సిటీ సమీపంలోని రహదారిని ఇకపై జార్జ్ మాథ్యూ స్ట్రీట్( George Matthew Street ) అని పిలుస్తారు.

తనకు దక్కిన గౌరవం పట్ల జార్జ్ మాథ్యూ మాట్లాడుతూ.తాను తొలుత యూఏఈకి( UAE ) వచ్చినప్పుడు మౌలిక సదుపాయాలు ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉన్నాయన్నారు.జాతిపిత దివంగత హెచ్‌హెచ్ షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ స్పూర్తితో ప్రజలకు సహాయం చేయడానికి నన్ను నేను అంకితం చేసుకున్నానని జార్జ్ చెప్పారు.

డాక్టర్ జార్జ్ మాథ్యూ కేరళలోని( Kerala ) పథనంతిట్టలోని తుంపమోన్‌లో పెరిగారు.త్రివేండ్రం మెడికల్ కాలేజీ నుంచి 1965లో ఎంబీబీఎస్ పట్టభద్రుడయ్యారు.1967లో తన 26వ ఏట యూఏఈలో అడుగుపెట్టారు.మొదట్లో అమెరికాకు వెళ్లడానికి సిద్ధమవుతుండగా.

Advertisement

ఒక స్నేహితుడి సూచన మేరకు ఆయన ఇక్కడికి వచ్చారు.డాక్టర్ మాథ్యూకి భార్య వల్సా, కుమార్తె ఉన్నారు.

యూఏఈలో అడుగుపెట్టాక అల్ ఐన్ తొలి ప్రభుత్వ వైద్యునిగా జార్జ్‌ను నియమించారు.షేక్ జాయెద్( Sheikh Zayed ) ఆశీర్వాదంతో ఆయన తొలి క్లినిక్‌ను ప్రారంభించారు.జనరల్ ప్రాక్టీషనర్‌గా తన సేవలను ప్రారంభించిన డాక్టర్ మాథ్యూ.

స్టానికులతో ఆప్యాయంగా మత్యౌస్ అని పిలిపించుకున్నారు.ఆయన కారణంగా యూఏఈలో ఆధునిక వైద్యం వృద్ధి చెందింది.1972లో అల్ ఐన్ రీజియన్ మెడికల్ డైరెక్టర్‌గా, 2001లో హెల్త్ అథారిటీ కన్సల్టెంట్ సహా అనేక కీలక పదవులను డాక్టర్ మాథ్యూస్ నిర్వహించారు.ఆయన సహకారంతో ఎమిరేట్స్ ప్రభుత్వం.

దేశంలో ఆరోగ్య సంరక్షణ సేవలను గణనీయంగా అభివృద్ది చేసింది.

జగన్ చేస్తున్న డిమాండ్ అమలు సాధ్యమేనా ? 
Advertisement

తాజా వార్తలు