షార్ట్ సర్క్యూట్ తో రెండు ఇల్లు దగ్ధం...

గృహలక్ష్మి కింద డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేపిస్తామని హామీ ఇచ్చిన ప్రజాప్రతినిధులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బాబాజీ కాలనీలో ఈరోజు షార్ట్ సర్క్యూట్ తో రెండు ఇండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

వెంటనే ఘటనా స్థలానికి తంగళ్ళపల్లి మండలం ఎంపీపీ పడిగేలా మానస రాజు,సర్పంచ్ అంకారపు అనిత రవీందర్, ఎంపీటీసీ కోడి అంతయ్య, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గజబింకర్ రాజన్న, మైనార్టీ నాయకులు ఎండి హమీద్, సారంపల్లి ఎంపిటిసి గుగ్గిల లావణ్య అంజయ్య చేరుకుని బాధితులకు ప్రభుత్వం నుండి గృహలక్ష్మి పథకం కింద డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని ఎంపీపీ హామీ ఇవ్వడం జరిగింది.అలాగే అన్ని విధాల సహాయం చేయడానికి ముందుంటామని బాధితులకు భరోసా ఇవ్వడం జరిగింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021

తాజా వార్తలు